/rtv/media/media_files/2025/07/25/microsoft-2025-07-25-17-11-49.jpg)
మైక్రోసాఫ్ట్ లో ఈ ఏడాది భారీగా ఉద్యోగ తొలగింపులు జరిగాయి. ఇప్పటి వరకు కంపెనీ సుమారుగా 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఉద్యోగ కోతలు వివిధ దశల్లో జరిగాయి, ముఖ్యంగా ఇటీవల జూలైలో 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఈ తొలగింపులు సంస్థ చరిత్రలోనే కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ తొలగింపుల తర్వాత కూడా స్టాక్ మార్కెట్లో జూలై 9న తొలిసారిగా కంపెనీ షేరు 500 డాలర్ల మార్కును దాటింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ తొలగింపులకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, కంపెనీ పునర్వ్యవస్థీకరణ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఈ ఉద్యోగ కోతలు భారీగా ప్రభావం చూపుతున్నాయని అంగీకరించారు. కాగా మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు.. 2025లో టెక్ రంగంలో 80,000కి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.
Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
Just one example this year.
— Dr. Swa (@dr_swa6) July 12, 2025
"The global tech sector has experienced a major downsizing trend in 2025, with more than 100,000 positions eliminated across leading firms."
Tech layoffs: Microsoft cuts 15,000 jobs in 2025. https://t.co/f0WxZAOGXS
Also Read : ఈ డ్రెస్ లో కీర్తిని చూస్తే ఎవ్వరైనా ఫిదా! ఫొటోలు చూశారా
ఇంటెల్ నుంచి 25,000 ఉద్యోగులు
ప్రపంచంలోనే ప్రముఖ చిప్ తయారీ సంస్థ అయిన ఇంటెల్ కూడా ఆర్థిక సమస్యల వల్ల 25,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెల్‌లో 1,08,900 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇంటెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఇంటెల్ సుమారు 15 శాతం అంటే 15,000 మంది ఉద్యోగులను తగ్గించింది. అయితే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనుంది.
Also Read : BREAKING: యూట్యూబర్స్‌కు బిగ్ షాక్.. 30 వేల ఛానెల్స్ రద్దు!
Also Read : శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!
Microsoft Layoffs | business