Flying Cars: కార్లకు రెక్కలు వచ్చాయ్.. ఇకపై గాల్లో తేలుతూ వెళ్లొచ్చు..

గాల్లో ఎగిరే కార్లని తయారు చేసింది కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం, ఈ కార్ ధర సుమారు రూ.2.5 కోట్లు ఉండే అవకాశం ఉంది. 2025 చివర్లో దీన్ని మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.

New Update
Flying Cars

Flying Cars

Flying Cars: మీరు కార్ తో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారా..? ఒక్కసారిగా గాల్లోకి పైకి ఎగిరి ఎగురుకుంటూ ట్రాఫిక్ నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా..?  ఇప్పుడు మీ కోరిక నిజం కాబోతుంది, కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ, గాల్లో ఎగిరే కార్లను తయారుచేసింది. ఈ సంస్థ తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు ‘మోడల్ ఏ’ని టెస్ట్ చేస్తూ ఒక వీడియో ని షేర్ చేసింది. ఈ వాహనం, గాల్లో, రోడ్ల మీద వెళ్ళేలాగా తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది.

Also Read:Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

‘మోడల్ ఏ’

గాల్లో ఎగిరే కార్ అనగానే పెద్ద పెద్ద ఫ్యాన్ లాంటి వాటితో డ్రోన్ లాగానో, హెలికాప్టర్ మోడల్ లాగానో ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఈ ‘మోడల్ ఏ’ కారు కొత్త డిజైన్‌తో రూపొందించారు. ఇందులో ఇన్‌బిల్ట్ రోటర్ బ్లేడ్స్ ఉండటంతో నార్మల్ ఆటోమోటివ్ డిజైన్‌తోనే నేల నుంచి ఎగరగలదు. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఒకసారి ఛార్జ్ చేస్తే, రోడ్లపై 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు, అలాగే గాల్లో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది.

Also Read:SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలాంటి రన్ వే సహాయం లేకుండా ఉన్న చోట నుండే పైకి ఎగరగలదు. ‘మోడల్ ఏ’ కోసం ఇప్పటికే 3,300 ప్రీఆర్డర్లు అందినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కార్ ధర సుమారు 3,00,000 డాలర్లు (రూ.2.5 కోట్లు) ఉండే అవకాశం ఉంది, 2025 చివర్లో దీన్ని మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది.

Also Read:హైదరాబాద్ నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్స్.. లిస్ట్ ఇదే

Also Read:Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా

Advertisment
తాజా కథనాలు