/rtv/media/media_files/2026/02/09/gold-and-silver-2026-02-09-17-49-38.jpg)
Silver, Gold Futures Rally As Global Rebound, Weak Dollar Lift Metals
కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయి. గత కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు నేడు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు. దేశీయంగా పెరిగిన అమ్మకాల ఒత్తిడి కారణంగా ఈ కనిష్ట స్థాయిలు నమోదైనట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read : ర్యాపిడో నుంచి ఫుడ్ డెలివరీ యాప్..
ప్రస్తుతం రూ.1,64,510
నేటి మార్కెట్ వివరాల్లోకి వెళ్తే.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 3,110 రూపాయల మేర తగ్గింది. దీంతో నిన్నటి వరకు ఆకాశాన్నంటిన ధర ప్రస్తుతం రూ.1,64,510 వద్ద కొనసాగుతోంది. ఇక సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 2,850 రూపాయల వరకు తగ్గి రూ. 1,50,800 వద్దకు చేరుకుంది.
కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి కూడా భారీగా పతనమై షాక్ ఇచ్చింది. ఒకే రోజు కేజీ వెండిపై ఏకంగా రూ. 20 వేలమేర ధర తగ్గడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,95,000 నమోదైంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఇలా ధరలు భారీగా తగ్గడం అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు పెద్ద ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయా లేదా ఇక్కడే స్థిరంగా ఉంటాయా అన్నది వేచి చూడాలి.
Also Read : మనీలాండరింగ్ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
Follow Us