లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల లాభంలో ఉందంటే?

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్‌ మొదలయ్యింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది.

New Update
stock market

stock markets

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ షేర్ మార్కెట్లు కూడా పాజిటివ్‌గానే లాభాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్‌ (Sensex) 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ (Nifty) 22,600 వద్ద ట్రేడింగ్‌ మొదలయ్యింది. 

ఈ షేర్లు లాభాల్లో ఉండగా..

ఉదయం 9:30 గంటలకు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్‌ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది. నిఫ్టీ 145 పాయింట్లు పెరిగి 22,654 వద్ద ఉంది. అయితే సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జొమాటో, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉండగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

ఇది కూడా చూడండి:Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.65 శాతం,  నాస్‌డాక్‌ 0.31 శాతం, డోజోన్స్‌ 0.85 శాతం లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ, హాంకాంగ్‌ హాంగెసెంగ్‌ 1 శాతం మేర లాభంతో కదలాడుతుంటే.. షాంఘై, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ మాత్రం బలహీనంగా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.4,488 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,001 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.

ఇది కూడా చూడండి:IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

Advertisment
తాజా కథనాలు