న్యూ ఫైనాన్షియల్ ఇయర్.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు కొత్త ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 450 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,400 మార్క్‌ వద్ద ట్రేడ్ అవుతుంది. హెచ్‌సీఎల్‌, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

New Update
Stock Markets

Stock Markets

కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల వల్ల నేడు స్టార్ మార్కెట్లు నష్టాల్లోనే ఉన్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 450 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,400 మార్క్‌ వద్ద ట్రేడ్ అవుతుంది.

ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఈ షేర్లు నష్టాల్లో..

ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 374 పాయింట్ల నష్టంతో 77035 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 23433 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30లో ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, నెస్లే ఇండియా షేర్లు ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

ఇదిలా ఉండగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఏకంగా రూ.41 రూపాయలు తగ్గిస్తూ అయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.  1762కు చేరుకుంది. హైదరాబాద్​లో కమర్షియల్​ సిలిండర్​ ధర రూ. 44 తగ్గి, రూ. 1,985.50కి చేరింది.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

2025 ఫిబ్రవరి ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధరను రూ.6.50 తగ్గించారు. మార్చి ఒకటో తేదీన  రూ. 5.5 రూపాయలు పెంచారు. కమర్షియల్​గ్యాస్​ సిలిండర్​లను ఎక్కువగా హోటల్, రెస్టారెంట్లలలో ఉపయోగిస్తుంటారు. ఈ ధరలు తగ్గితే రెస్టారెంట్లపై భారం తగ్గుతుంది. తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్లకు ఉపయోగకరం అవుతుంది.  

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

RCB VS LSG: పట్టికలో రెండో స్థానం..క్వాలిఫయర్ 1కు దూసుకెళ్ళిన ఆర్సీబీ

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచికొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆడిన ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటూ టేబుల్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్నో ఇచ్చిన 227 టార్గెట్ ను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. 

ipl
RCB VS LSG

RCB VS LSG: ఆర్సీబీ చితక్కొట్టేస్తోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ దూసుకుపోతోంది. నిన్న జరిగిన లక్నో మ్యాచ్ లో బౌలర్లు, బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 228 పరుగులు చేసింది.

 Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

కెప్టెన్‌ జితేశ్‌ శర్మ 33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 పరుగులు, విరాట్‌ కోహ్లీ  30 బంతుల్లో 10 ఫోర్లులతో 54 పరుగులు, మయాంక్‌ అగర్వాల్‌  23 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులతో ఆకశమే హద్దుగా చెలరేగిపోయారు. లఖ్‌నవూ బౌలర్లలో విలియమ్‌ ఓ రూర్క్ 2, అవేశ్‌ ఖాన్‌, ఆకాశ్‌ మహరాజ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. మొత్తానికి ఈ మ్యాచ్ తో లీగ్ దశ పూర్తయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు సెలెక్ట్ అయింది. ఈ నెల 29న క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌తో బెంగళూరు ఢీకొట్టనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో తలపడనుంది.

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

 రసవత్తరమైన మ్యాచ్..

లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 228 భారీ టార్గెట్ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. సెంచరీతో విజృంభించాడు. 61 బంతుల్లో 118 స్కోర్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67 పరుగులు, మాథ్యూ బ్రీట్జ్కే 12 బంతుల్లో 14 పరుగులు, నికోలస్ పూరన్ 10 బంతుల్లో 13 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా 1 వికెట్, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్, షెపర్డ్ 1 వికెట్ తీశారు. 

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

  • May 28, 2025 21:09 IST

    పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

    అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాల వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు. సరిహద్దు రాష్ట్రం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. బార్డర్ , ఏజెన్సీ ఏరియాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది.

    Arms to citizens in Assam



  • May 28, 2025 20:38 IST

    సీఎం రేవంత్ రెడ్డికి షాక్.. మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్!!

    చెన్నూర్ MLA వివేక్‌కు, మాలలకు మంత్రి పదవి ఇవ్వద్దని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం అధిష్ఠానాన్ని కలవనున్నారు. మే 30న అధిష్టానంతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. 30న కొత్త మంత్రుల పేర్లు ఖరారు అవుతాయని సమాచారం.

    Meenakshi Natarajan Revanth Reddy
    Meenakshi Natarajan Revanth Reddy

     



  • May 28, 2025 19:07 IST

    బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

    పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్, పర్యవేక్షించింది ISI చీఫ్ అని ఆ దేశ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఆదిల్ రాజా అన్నారు. ప్రజల్లో అసిమ్ మునీర్ పట్ల ఉన్న అసమ్మతిని మళ్లించడానికే అసిమ్ మునీర్ పహల్గామ్ అటాక్‌ చేశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    Pahalgam Terror Attack
    Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

     



  • May 28, 2025 17:41 IST

    జూబ్లీహిల్స్‌‌ పబ్‌‌లో లైట్లు ఆర్పి.. మహిళలపై అరాచకం

    జూబ్లీహిల్స్‌లోని బేబీలాన్ పబ్‌లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో లైట్లు ఆపేసి తన తల్లి, చెల్లిని కొట్టారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆవేదన వ్యక్తం చేసింది. 

    Jubilee Hills Pub



  • May 28, 2025 17:40 IST

    క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు.. అసలు కన్నడ 'భాషా' వివాదమేంటి?

    క్యాబ్ డ్రైవర్ నుంచి కమల్ హాసన్ వరకు కన్నడ భాషా వివాదం కొనసాగూతునే ఉంది. గూగుల్‌సైతం కన్నడను వికారమైన భాషగా చూపించగా.. కర్ణాటకలో కన్నడ మాట్లాడని ఉద్యోగులపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కన్నడ భాష వివాదాలపై ప్రత్యేక కథనం చదవండి.   

    kannada lng
    kannada lng Photograph: (kannada lng)

     



  • May 28, 2025 17:39 IST

    పెళ్లి వేదికపైకి ఖడ్గమృగం సడెన్ ఎంట్రీ..

    నేపాల్ లోని చిత్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలోకి ఖడ్గమృగం నడుచుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని అక్కడ పెళ్ళిలో ఉన్న ఓ నెటిజన్ వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది.

    viral video_ Rhino walks into wedding
    viral video_ Rhino walks into wedding

     



  • May 28, 2025 15:48 IST

    సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా

    హీరో మంచు విష్ణు 2019 ఎలక్షన్ సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

    manchu vishnu about Prabhas
    Manchu Vishnu Approaches Supreme Court

     



  • May 28, 2025 15:46 IST

    మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన!

    నానోబోట్‌ల ద్వారా 2030 నాటికి మానవులు మరణంపై ఆధిపత్యం సాధించవచ్చని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ చెప్పారు. నానోబోట్స్ మానవ రక్తంలోకి ప్రవేశించి వ్యాధులను నయం చేస్తాయని, ఈ సూక్ష్మ యంత్రాలు భవిష్యత్తును ముందే అంచనా వేస్తాయని చెబుతున్నారు. 

    Ray Kurzweil
    Ray Kurzweil Photograph: (Ray Kurzweil)

     



  • May 28, 2025 15:46 IST

    ఖమ్మంలో పుష్ప-3.. స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే?

    ఏపీ-ఒడిశా సరిహద్దులలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.4.15 కోట్ల విలువైన 830 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల్లోనే 2,711 కేజీల గంజాయితోపాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

    Narcotics and marijuana
    Narcotics and marijuana

     



  • May 28, 2025 15:45 IST

    బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్

    రోడ్డుపై బుర్ఖాలో వెళ్తున్న అమ్మాయికి ముద్దుపెట్టి రచ్చ చేశాడు ఓ ఆకతాయి. ఈ ఘటన హైదరాబాద్ లోని పాత బస్తీలో జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Hyderabad_ a random biker kissed women on the road
    Hyderabad_ a random biker kissed women on the road

     



  • May 28, 2025 14:59 IST

    కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మాక్‌డ్రిల్

    పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మే 29 (గురువారం) సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

    V BREAKING



  • May 28, 2025 14:42 IST

    టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. మహానాడులో సంచలన ప్రకటన!

    పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.

    Nara Lokesh: ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేష్

     

     

     



  • May 28, 2025 13:46 IST

    TG Crime : ఏం మనుషులురా మీరు....మాన‌సిక విక‌లాంగురాలిపై తండ్రీకొడుకు అత్యాచారం

    హైద‌రాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.

    Father and son rape mentally disabled woman
    Father and son rape mentally disabled woman

     



  • May 28, 2025 13:46 IST

    Puducherry Yoga Mahotsav IYD 2025: కౌంట్‌డౌన్ స్టార్ట్.. పుదుచ్చేరిలో ప్రారంభమైన యోగ మహోత్సవాలు.. 6,000 పైగా హాజరు!

    అంతర్జాతీయ యోగ దినోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా పుదుచ్చేరిలో యోగా మహోత్సవాన్ని నిర్వహించగా 6,000 పైగా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

    IYD 2025 event Puducherry
    IYD 2025 event Puducherry

     



  • May 28, 2025 13:45 IST

    NTR AI Video: మహానాడులో ఎన్టీఆర్‌ ఏఐ స్పీచ్ గూస్‌బంప్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

    కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభ ప్రారంభమైంది. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాల నుంచి భారీగా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐతో రూపొందించిన ఎన్టీఆర్‌ ప్రసంగం వీడియో ప్రజంటేషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

    Mahanadu NTR AI VIDEO
    Mahanadu NTR AI VIDEO Photograph: (Mahanadu NTR AI VIDEO)

     



  • May 28, 2025 12:50 IST

    Virat Kohli - RCB: కింగే కింగు.. ఒకే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు - అదరగొట్టేశాడు భయ్యా

    లక్నోతో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 3 రికార్డులు సాధించాడు. టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. IPLలో 5సార్లు 600 పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక హాఫ్‌సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.

    rcb batter virat kohli three records in ipl 2025 against lsg
    rcb batter virat kohli three records in ipl 2025 against lsg Photograph: (rcb batter virat kohli three records in ipl 2025 against lsg)

     



  • May 28, 2025 12:49 IST

    Anna University Sexual Assault Case: అన్నా యూనివర్సిటీలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులు.. కోర్టు సంచలన తీర్పు

    అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్ధినిపై లైంగిక దాడి ఘటనపై చెన్నై మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అతనికి ఇంకా శిక్ష విధించలేదు.

    anna-university



  • May 28, 2025 12:44 IST

    Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అందాల సాంగ్‌.. సూపరెహే

    పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘తార తార’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అంద చందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

    HariHaraVeera Mallu



  • May 28, 2025 10:56 IST

    Jade Female Skydiver Dies: ప్రియుడితో బ్రేకప్‌.. 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్‌

    యూకేకు చెందిన మహిళా స్కైడైవర్‌ జేడ్‌ డమారెల్‌..10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌ చేస్తూ కింద పడి మరణించారు. పారాచూటింగ్‌లో 450కిపైగా జంపింగ్‌ల అనుభవం ఉన్న జేడ్‌ డమారెల్‌.. స్కైడైవింగ్‌ చేస్తున్న సమయంలో పారాచూట్‌ తెరుచుకోకపోవడంతో కిందపడి మరణించారు.

    Female Skydiver From Uk Dies
    Female Skydiver From Uk Dies

     



  • May 28, 2025 08:22 IST

    Brain Swelling Symptoms: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? వెంటనే చెక్ చేసుకోండి.. లేదంటే..!

    మెదడులో వాపు అత్యంత ప్రమాదకరమైన సమస్య. దీనిని వైద్య భాషలో "సెరిబ్రల్ ఓడీమా" అని పిలుస్తారు. ఇది పాథాలజికల్ స్థాయికి చేరుకుంటే, ప్రాణాలకే ముప్పు. ఈ ఆర్టికల్ లో మెదడువాపు లక్షణాలు ఏవో, ముందుగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

    Brain Swelling Symptoms
    Brain Swelling Symptoms

     



  • May 28, 2025 07:05 IST

    Trump: నిప్పుతో ఆడుకుంటున్నారు..పుతిన్ పై ట్రంప్ మండిపాటు

    రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉక్రెయిన్ మీద దాడులకు పాల్పడుతూ భారీ సంఖ్యలో ప్రజలను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    Donald Trump
    Donald Trump

     



  • May 28, 2025 07:04 IST

    RCB VS LSG: పట్టికలో రెండో స్థానం..క్వాలిఫయర్ 1కు దూసుకెళ్ళిన ఆర్సీబీ

    బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దంచికొట్టింది. లక్నో మీద జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఆడిన ఆర్సీబీ క్వాలిఫయర్ 1 కు దూసుకెళ్లింది. దాంతో పాటూ టేబుల్ లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. లక్నో ఇచ్చిన 227 టార్గెట్ ను 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. 

    ipl
    RCB VS LSG

     



  • May 28, 2025 07:04 IST

    Telangana Govt : తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో రెండు డీఏలు!

    తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు పెండింగ్ లో ఉన్న డీఏలలో రెండు చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉద్యోగుల రిటైర్మెంట్ రోజునే బెనిఫిట్స్ లో కొంత మొత్తం చెల్లించనున్నట్లు తెలిసింది.

    Revanth



  • May 28, 2025 07:03 IST

    NTR Jayanthi : ఎన్టీఆర్‌ జయంతి.. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి

    ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.

    ntr-kalyan-ram



Advertisment
Advertisment