నష్టాలకు స్టాప్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నష్టాలకు బ్రేక్ ఇచ్చి లాభాలతో స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Stock Market Today : డౌన్ ట్రెండ్ తో మొదలైన స్టాక్ మార్కెట్లు
New Update

గత ఐదు రోజుల నుంచి నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఊపందుకున్నాయి. నష్టాలకు స్టాప్ పెట్టి.. దేశీయ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ఉన్న సమస్యల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజుల నుంచి కుప్పకూలుతున్నాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 81,745, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 25,049 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: హైదరాబాద్‌లో సంచలనం.. భార్యని ఏసీబీకి పట్టించిన మాజీ భర్త

లాభాల్లో ట్రేడవుతున్న..

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు ప్రస్తుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

ఇది కూడా చూడండి: కండోమ్ కంపెనీ పై కేసు వేసిన సుహాస్.! 'జనక అయితే గనక' ట్రైలర్

ఇదిలా ఉంటే నిన్న నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యుద్దాల కారణంగా నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పంజుకున్నాయి. నష్టాలతో ప్రారంభమైన కొంత సమయం తర్వాతే 81,763.28 పాయింట్ల దగ్గర గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 584.81 పాయింట్ల లాభంతో 81,634.81 దగ్గర ఆగింది. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్‌ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

 

#stock-market #nifty-record #sensex-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe