Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల ప్రాఫిట్ తో 81,727 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ దాదాపు 81 పాయింట్ల లాభపడి 25,063 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market,
New Update

ఇవాళ ఉదయం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ బుధవారం అమెరికన్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. ఈ రోజు అంటే గురువారం ఆసియా మార్కెట్లు అద్భుతంగా ర్యాలీ చేస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లకు సరికొత్త ఉత్సాహం వచ్చింది.

లాభాలతో ప్రారంభం

ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల ప్రాఫిట్ తో 81,727 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ దాదాపు 81 పాయింట్ల లాభపడి 25,063 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీని కారణంగా డాలర్ తో రూపాయి మారకం విలువ 83.95 గా ఉంది. ఎఫ్‌ఎంసీజీ, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఆదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్ డబ్లూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్, టీసీఎస్, ఎనర్జీ షేర్లలో జోష్‌ వల్ల ఆయా ఇండెక్స్‌లు పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, నెస్తే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండిః కన్నీళ్లు పెట్టించే రతన్ టాటా ప్రేమ కథ.. ఆమె కోసమే పెళ్లి చేసుకోలేదా?

అదే సమయంలో టాటా గ్రూప్‌లోని స్టాక్స్‌లో కొన్ని లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేరు 3.27 శాతం లాభపడి రూ.476.0కి చేరుకుంది. అలాగే సెషన్‌లో ఇది గరిష్టంగా రూ.476.85, కనిష్టంగా రూ.455.9ని తాకింది.

కాగా బుధవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అదే జోష్ లో ఇవాళ ఆసియా - పసిఫిక్ మార్కెట్లు లాభాల బాటలో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు() నిన్న (బుధవారం) నికరంగా రూ.4,563 కోట్ల విలువ చేసే షేర్లు విక్రయం చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు () నికరంగా రూ.3,509 కోట్ల షేర్లను విక్రయం చేశారు. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు 2,631.50 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ.77.11 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. 

#stock-market #stock-market-news #indian-stock-market
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe