కన్నీళ్లు పెట్టించే రతన్ టాటా ప్రేమ కథ.. ఆమె కోసమే పెళ్లి చేసుకోలేదా?
రతన్ టాటా అమెరికాలో చదువుతున్న సమయంలో ఓ యువతిని ప్రేమించారు. కొద్దిరోజుల తర్వాత ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో భారత్-చైనా మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో కొన్నాళ్లు ఇండియాలోనే ఉండిపోయారు. ఈలోగా అమ్మాయికి పెళ్లి అయిపోయింది. అప్పటి నుంచి ఒంటిరిగానే ఉండిపోయారు.
సొంత కంపెనీతో యావత్ ప్రంపంచాన్నే శాసిస్తున్న గ్రేట్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా. అతడు తలచుకుంటే పెద్ద పెద్ద బిలీనియర్ కుటుంబాలకు చెందిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. కోట్ల ఆస్తికి అధిపతి అయిన రతన్ టాటా సక్సెస్ వెనుక ఒక ఫెల్యూర్, కన్నీళ్లు తెప్పించే లవ్ స్టోరీ ఉంది.
రతన్ టాటా లవ్ స్టోరీ మొదలైంది అక్కడే
1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ నవల్ టాటాకు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా ముత్తాత అవుతారు.రతన్ టాటాకు పదేళ్ల వయసున్నపుడు రతన్ పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో రతన్ తన నానమ్మ నవాజ్ బాయి టాటా వద్ద పెరిగారు. తన ఉన్నత చదువులు మొత్తం అమెరికాలోనే చదివారు. ఆ సమయంలోనే తన క్లాస్ మేట్ అయిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆపై ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుని గట్టిగా ఫిక్స్ అయ్యారు.
Titan clocks stopped today.#RatanTata , the visionary who steered Tata Sons into a global powerhouse, has passed away at 86. End of an Era. Rest in Power 🙏 pic.twitter.com/Apbz0xvaK7
సీన్ కట్ చేస్తే రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన నామ్మమ్మ అనారోగ్యానికి గురైనట్లు భారత్ నుంచి కబురువచ్చింది. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు కొన్ని రోజులు ఇండియాలోనే రతన్ టాటా ఉండిపోయారు. కొద్ది రోజులకే భారత్ - చైనాకు యుద్ధం ప్రారంభం అయింది. ఇక చేసేదేమి లేక మళ్లీ తిరిగి చాలా ఏళ్ల పాటు అమెరికాకు వెళ్లలేకపోయారు. ఇక సినిమాలో ఎలా అయితే హీరోయిన్ ని తమ తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అడ్డు చెబుతారో.. రతన్ టాటా లవ్ స్టోరీలో కూడా అదే జరిగింది.
అప్పటికి ఫోన్ కాంటాక్ట్ లేకపోవడంతో ఇద్దరి మద్య చాలా గ్యాప్ వచ్చింది. చాలా ఏళ్లు గడిచిపోయాయి.. తన ప్రియురాలిని చూసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ ఓ షాకింగ్ విషయాన్ని తెలుసుకున్నారు. అప్పటికే ఆమెకు పెళ్లైందన్న విషయాన్ని తెలుసుకుని తన ప్రేమ ప్రయాణాన్ని ఆపేశారు.మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమై, పెళ్లి పత్రికలు ముద్రించే దశ దాకా వెళ్లింది.. కానీ అదీ ఆగిపోయింది. అలా ఓ నాలుగు లవ్ స్టోరీలు విఫలం అయ్యాయి.అంతే ఇక తను పెళ్లి మాటే ఎత్తలేదు.
Late Ratan Tata never married and has no children.
In various interviews, he has spoken about his decision not to marry, citing personal reasons. #RatanTata#OmShanti
ఇప్పటికీ ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు. పెళ్లి తర్వాత రతన్ టాటా సింగిల్ గానే ఉండిపోయారు. అప్పటి ప్రేయసి ఏవిధంగా అయితే జీవితంలో సక్సెస్ కావాలనుకున్నారో.. అదే విధంగా రతన్ టాటా తన ఒంటరి పోరాటంలో పోరాడి నిలిచారు. ఈ లవ్ స్టోరీ గురించి స్వయంగా రతన్ టాటానే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన లైఫ్ కు దగ్గరకి వచ్చినట్లు వచ్చి చేజారిపోయిన ప్రియురాలి గురించి చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు రతన్ లైఫ్ సక్సెస్ స్టోరీ వెనుక ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.