Anil Ambani: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థల పైనా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మూడేళ్ల పాటు నిషేధాన్ని విధించింది.
Also Read: హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు
నకిలీ బ్యాంక్ గ్యారంటీలు...
నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించినట్లు తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భవిష్యత్తులో మూడేళ్ల పాటు ఈ కంపెనీ ఎస్‌ఈసీఐ నిర్వహించే బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశాలు లేవు.
Also Read: నందీశ్వరుల విగ్రహ తవ్వకాల్లో బిగ్ ట్విస్ట్.. అయోమయంలో గ్రామస్థులు
ఎస్‌ఈసీఐ జూన్ లో 1 గిగా వాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇందులో రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్ బెస్ పాల్గొంది. అయితే చివరి రౌండ్ బిడ్డింగ్ లో ఆ సంస్థ నకిలీ గ్యారెంటీలు అందించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్‌ఈసీఐ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Allu Arjun: ఇది మతిలేని చర్య.. అల్లు అర్జున్ కేసుపై న్యాయమూర్తి సీరియస్
దీంతో ఆ బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసి, వెంటనే సంస్థ పై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధంతో అనిల్ అంబానీకి మరో పెద్ద చిక్కొచ్చిపడినట్లైంది. ఈ ఏడాది ఆగస్టులోనే మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ...సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
Also Read: HBD Anushka: యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ
నిధుల మళ్లింపు ఆరోపణలో నేపథ్యంలో రూ. 25 కోట్ల జరిమానా విధించింది. అయితే అక్టోబర్ లో సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ సెబీని పెనాల్టీ వసూలు చేయకుండా ఆపినప్పటికీ కూడా ఆయన పై నిషేధం కొనసాగుతుంది.