మార్కెట్‌లోకి వచ్చేస్తున్న శాంసంగ్ ట్రై ఫోల్డబుల్‌ ఫోన్‌.. ఫీచర్లు మస్తున్నాయ్ బ్రదర్

శాంసంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్‌ పేరుతో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ ఏడాది జులైలో లాంఛ్ చేయాలని శాంసంగ్ భావిస్తోంది. అయితే పరిమిత సంఖ్యలోనే ఈ మొబైల్స్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ ఉండనుంది.

New Update
Samsung

Samsung Photograph: (Samsung)

మార్కెట్‌లో రోజు కొత్త కొత్త రకాల మొబైల్స్ వస్తుంటాయి. మొబైల్ ఫీచర్లకు తగ్గట్లు ధర ఉన్న వాటిని చాలా మంది కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం ఫోల్టబుల్ మొబైల్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో శాంసంగ్ (Samsung) గెలాక్సీ జీ ఫోల్డ్‌ (Galaxy G Fold) పేరుతో కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. గతేడాది శాంసంగ్ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (SDC)లో ట్రై ఫోల్డబుల్‌ ఫోన్‌‌ను తెలిపింది.

ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

మొబైల్స్ లాంఛ్ చేయనున్నట్లు..

అప్పటి నుంచి ఫోన్‌పై ప్రయోగాలు చేస్తుంది. అయితే ఈ మొబైల్ ఫోన్‌ను ఈ ఏడాది జులైలో లాంఛ్ చేయాలని శాంసంగ్ భావిస్తోంది. అయితే పరిమిత సంఖ్యలోనే ఈ మొబైల్స్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. హువావే తీసుకొచ్చిన ట్రై ఫోల్డబుల్ మొబైల్‌ మేట్‌ ఎక్స్‌టీ (Huawei Mate XT)లా కాకుండా జెడ్‌ ఫోల్డ్‌ కాస్త వెరైటీగా ఉంటుంది. 6.54 అంగుళాల ఎత్తుతో, 9.96 అంగుళాల ఇన్నర్‌ స్క్రీన్‌తో రానున్నట్లు సమాచారం. అయితే వీటి బరువు మాత్రం ఒకేలా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

అండర్‌ డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీ ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. హోల్‌- పంచ్‌ కటౌట్‌, ఆకర్షణీయమైన డిజైన్‌తో రానున్న ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ను ఎలాగైనా ఈ ఇయర్ లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే జులైలో జరగనున్నట్లు ఈవెంట్‌లో ఈ ట్రై ఫోల్డబుల్‌ ఫోన్‌ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వీటితో పాటు గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 7 ఎఫ్‌ఈ కూడా లాంచ్‌ చేయనుంది.

ఇది కూడా చూడండి: Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు