బంపరాఫర్ భయ్యా.. రూ.8499కే 5జీ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

రెడ్‌మీ తాజాగా Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 4/64GB ధర రూ. 8499, 4/128GB ధర రూ. 9,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ నవంబర్ 27 నుండి mi.com, Amazon, Xiaomi రిటైల్ స్టోర్లలో సేల్‌కు రానుంది.

New Update
Redmi A4 5G

Xiaomi సబ్-బ్రాండ్ రెడ్‌మి పలు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ భారతదేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగానే Redmi తాజాగా భారతదేశంలో అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Redmi A4 5Gని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. అదే సమయంలో Qualcomm Snapdragon 4s Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌తో ఇన్‌స్టాల్ చేసిన మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.

Also Read: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

Redmi A4 5G Price

Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ స్టార్రీ బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీని 4GB + 64GB వేరియంట్ ధర రూ. 8499గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,499గా ఉంది. తాజాగా లాంచ్ అయిన ఈ ఫోన్ నవంబర్ 27 నుండి mi.com, Amazon, Xiaomi రిటైల్ స్టోర్లలో సేల్‌కు అందుబాటులో ఉంటుంది.

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

Redmi A4 5G Features

Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. గరిష్ట ప్రకాశం 600 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 4S Gen 2 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంది. Redmi A4 5G ఫోన్ 4GB LPDDR4X ర్యామ్‌ని కలిగి ఉంది. అదే సమయంలో స్టోరేజ్‌ను SD కార్డ్‌ ద్వారా పెంచుకోవచ్చు. దాదాపు 1 TB వరకు పెంచుకోవచ్చు.

Also Read: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

కెమెరా

Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్ అందించబడింది. ఇది ఆండ్రాయిడ్ 14 OSలో నడుస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన ప్రైమరీ కెమెరా అమర్చబడింది.

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్‌లో సైడ్‌మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. అలాగే ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా Redmi A4 5Gకి 2 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు