రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులు ఎవరు?

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం తర్వాత టాటా వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రతన్ టాటా ట్రస్ట్‌లకు వారసులుగా నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీలు ప్రస్తుతం ముందంజలో ఉన్నారు.

New Update
FotoJet (19)

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణం తర్వాత టాటా వారసులు ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రతన్ టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రేసులో నోయెల్ టాటా, మెహ్లీ మిస్త్రీల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రతన్ టాటా సవతి తల్లి కుమారుడు అయిన నోయెల్ టాటా ట్రస్ట్‌లకు చైర్మన్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ద్వారా నోయెల్ టాటా ఇప్పటికే రతన్ టాటా ట్రస్ట్‌లో ట్రస్టీగా ఉన్నారు. మొత్తం కంపెనీలో టాటా ట్రస్ట్‌లదే 66 శాతం వాటా ఉంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అస్వస్థత

ఎవరీ నోయెల్ టాటా?

రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ నావల్ టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాటా వారసత్వాన్ని అతనే సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని భావిస్తున్నారు. నావల్ టాటా, సిమోన్ (రెండో భార్య) టాటాల కుమారుడే నోయెల్. ప్రస్తుతం నోయెల్ ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే టాటా స్టీల్, టైటాన్ వైస్ చైర్మన్‌గా కూడా నోయెల్ టాటా ఉన్నారు. 

ఇది కూడా చూడండి:ప్రధాని మోదీకి దొంగలు షాక్‌ !

తదుపరి రేసులో..

టాటా ట్రస్ట్‌లకు వారసుడు లిస్ట్‌లో నోయెల్ తర్వాత మెహ్లీ మిస్త్రీ పేరు వినిపిస్తోంది. రతన్ టాటాకు సన్నిహిత సహచరుడు అయిన మిస్త్రీ.. మెహెర్జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్. ఇతనికి టాటా గ్రూప్‌తో చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. అలాగే 2022 సెప్టెంబర్‌లో కారు ప్రమాదంలో మరణించిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి మెహ్లీ బంధువు. ఒకే వ్యక్తి రెండు సంస్థలకు అధిపతిగా ఉండకూడదనే ఉద్దేశంతో రతన్ టాటా టాటా సన్స్ చైర్మన్, టాటా ట్రస్ట్‌ల చైర్మన్లను విభజించారు.

ఇది కూడా చూడండి:  అమ్మకానికి సీఎం రేవంత్ ఫొటో.. ఎందుకో తెలుసా?

]

Advertisment
తాజా కథనాలు