BIG BREAKING: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అస్వస్థత AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి By V.J Reddy 11 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Nandigam Suresh: గుంటూరు జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థత గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. లో బీపీ, షోల్డర్ పెయిన్, చెస్ట్ పెయిన్ అని జైలు అధికారులకు సురేష్ చెప్పారు. అరెస్టు సమయంలోనే షోల్డర్ పెయిన్ ఉందని పోలీసులకు సురేష్ చెప్పినట్లు సమాచారం. పూర్తి స్థాయి వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు జైలు సిబ్బంది. గతంలో అరెస్ట్.. ఇటీవల నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టుకొట్టేసింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న నందిగం సురేష్ ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఇది ప్రభుత్వ కుట్ర అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. #ap-ycp #nandigam-suresh #guntur-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి