Dhanteras: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

ధంతేరాస్ సందర్భంగా కొన్ని డెలివరీ సంస్థలు బంగారం, వెండిని క్విక్ డెలివరీ చేయనున్నాయి. బిగ్ బాస్కెట్, స్విగ్గీ, బ్లింక్‌ఇట్, ఇన్‌స్టా మార్ట్ కేవలం 10 నిమిషాల్లోనే బంగారం, వెండి కాయిన్‌లను డెలివరీ చేయనున్నాయి.

author-image
By Kusuma
Gold coins
New Update

దీపావళి పండుగకి ముందు త్రయోదశి ధంతేరాస్ పండుగను జరుపుకుంటారు. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలు ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ రోజు కొత్త వస్తువులు కొనడం, ముఖ్యంగా బంగారం, వెండి వంటివి ఎక్కువగా కొంటుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొన్ని డెలివరీ సంస్థలు ప్రత్యేక సేవలను ప్రారంభించింది.

ఇది కూడా చూడండి: చైనాలో వేలాది స్కూల్స్ మూసివేత.. ఎందుకో తెలిస్తే షాక్

బంగారం, వెండి నాణేలు..

టాటా సంస్థకు చెందిన బిగ్‌బాస్కెట్ జ్యువెలరీ రిటైల్ చెయిన్ సంస్థ తనిష్కత్‌తో కలిసి కస్టమర్లకు బంగారం, వెండి డెలివరీ చేయనున్నాయి. ఈ డెలివరీ కూడా కేవలం 10 నిమిషాల్లోపే చేయనున్నట్లు తెలిపింది. దీనికోసం రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. దీంతో వినియోగదారులకు సేవలు మరింత చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: 'రచ్చ గెలిచి ఇంట గెలిచాను'.. ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డు వేడుకల్లో చిరంజీవి

లక్ష్మీ గణేష్(999.9 స్వచ్ఛత), వెండి నాణెం(10 గ్రా), తనిష్క్ 22 క్యారెట్ గోల్డ్ కాయిన్(1 గ్రా), లక్ష్మీ (1 గ్రా) నాణెలను ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది. ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ, ఇంటి సరకులు ఇలా ఒకేటేంటి అన్ని రకాలను డెలివరీ చేయడంతో బిగ్ బాస్కెట్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు తనిష్క్‌తో భాగస్వామ్యం తీసుకుంది.

ఇది కూడా చూడండి:  Chiruచిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం

దీనివల్ల వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.  మరింత విస్తరణకు అవకాశం లభించింది. కేవలం బిగ్ బాస్కెట్‌ మాత్రమే బంగారం, వెండి నాణేలను తొందరగా డెలివరీ చేయకుండా..బ్లింక్ఇట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్  వంటివి కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఈ క్విక్ డెలివరీ సేవలకు ప్రత్యేకించి పండుగల సీజన్‌లో డిమాండ్ పెరుగుతోంది. షాప్‌లకు వెళ్లి కొనేంత సమయం లేని వారికి ఈ క్విక్ డెలివరీ బాగా ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చూడండి: US Elections: అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్‌ కే!

#delivery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe