US Elections: అమెరికాలో ఆ పార్టీ ఓట్లు ట్రంప్ కే! ట్రంప్ , డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి కమల హారిస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్‌లో ఈ ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. By Bhavana 29 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి US Elections: 'సంస్క్రతి, సన్మార్గం దేశానికి ఆదర్శం..' ఇదేదో బీజేపీ అనుబంధ సంస్థలు సోషల్‌మీడియాలో పెట్టిన క్యాప్షన్ కాదు. ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డ భారతీయులు యూఎస్-డల్లాస్‌లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా అంటించిన పోస్టర్లు. రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా అక్కడి ఇండియన్స్ ఈ పోస్టర్స్ పెట్టారు. ఇవి చాలా రోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మరోవైపు నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ట్రంప్ , డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి కమల హారిస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్‌లో ఈ ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. Also Read: చిరు వర్సెస్ మోహన్ బాబు..మరోసారి తెరపైకి లెజెండరీ అవార్డు వివాదం అరిజోనా, నెవెడా,విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాలను స్వింగ్ స్టేట్స్ అంటారు. ఇక్కడ ఓటర్ల నిర్ణయం బట్టి అధ్యక్షుడు ఎవరన్నది తేలుతుంది. ఈసారి ఎన్నికల్లో పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్లకు మద్దతు కొంచెం ఎక్కువగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్లో 47 శాతంతో ముందు ఉండగా, కమలా హారిస్ 45 శాతంలో ఉన్నారు. ఇక నెవడాలో మాత్రం హారిస్ గెలిచే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రంప్‌కి 47 శాతం ఉండగా, కమలా హారిస్‌కి 48 శాతం మద్దతు ఉంది. మిచిగాన్, విస్కాన్సిన్‌లలో ఇద్దరికి 49 శాతం మద్దతు ఉంది. ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ సర్వే ప్రకారం.. హారిస్‌కి ఆసియన్లు, యూత్‌లో ప్రజాదరణ ఉండగా, మిగతా వర్గాలు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. Also Read: బెటాలియన్ పోలీసులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం అమెరికాలో భారతీయ ఓటర్లు.. ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. అమెరికాలో భారతీయ ఓటర్లు అధికంగానే ఉన్నారు. ఇక్కడకు వచ్చి సెటిల్ అయినవారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉంది. భారతీయులకు ట్రంప్‌తో ఇంతకు ముందే అనుభవం ఉంది. లాస్ట్ టైమ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయులు నానా కష్టాలు పడ్డారన్న విమర్శలున్నాయి. వీసాల జారీను చాలా కట్టుదిట్టం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సారి కూడా ట్రంప్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కఠినంగానే ఉంటారని చెబుతున్నారు. వీసాలను కూడా ఎక్కువ ఇవ్వకపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. Also Read: డెలివరీ తర్వాత మహిళలు ఇలా చేశారంటే డిప్రెషన్‌లోకి వెళ్తారు ట్రంప్ విజయం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై ఫిలిప్ క్యాపిటల్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. రిపబ్లికన్ పార్టీ కనుక విజయం సాధిస్తే...ఇంతకు ముందులానే వీసాల ప్రాబ్లెమ్ మళ్ళీ షురూ అవుతుందని చెబుతున్నారు. వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని.. ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయని అంటున్నారు. దీంతో అమెరికన్ కంపెనీలు...ఇండియా నుంచి ఉద్యోగులను తెప్పించుకోవడం మానేస్తాయని..స్థానికులనే నియమించుకుంటాయని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికన్ మార్కెట్‌లో భారత ఉద్యోగులకు డిమాండ్ తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత కంపెనీలు చాలా మట్టుకు ఆన్‌సైట్ ప్రోత్సహించడం లేదు. ఇప్పుడు వీసాలను టైట్ చేసేస్తే...ఆ ఉన్న ఛాన్స్ కాస్తా మరింత తగ్గిపోతుంది. Also Read: ఇట్స్ అఫీషియల్, రెండు భాగాలుగా 'SSMB29'.. బడ్జెట్ రివీల్ చేసిన టీమ్ అయితే ఈ విషయంలో కమలా హారిస్‌కు భారతీయుల నుంచి మద్దతు బాగానే ఉంది. స్వతహాగా ఆమె ఇండియన్ ఆరిజీన్ కలిగి ఉండడం ప్లస్‌గా పాయింట్‌గా మారింది. అదీ కాకుండా ఇమ్మిగ్రెంట్స్ విషయంలో సానుకూలంగా ఉంటానని కమలా చెబుతున్నారు. ఇది కూడా ఆమెకు కలిసి వచ్చే అంశం. అయితే ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి అంత ఏమీ గొప్పగా లేదు. దానికి తోడు ఇరాన్, ఇజ్రాయెల్...రష్యా-యుక్రెయిన్ యుద్ధాలు నెత్తిమీద ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్‌కు డైరెక్ట్‌గానే సపోర్ట్ చేస్తోంది. వీటి మీద కూడా ఆధారపడి ఓట్లు పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో భారతీయులు కూడా ట్రంప్‌కు విపరీంగా మద్దతు పలుకుతున్నారు. సన్మార్గం, జాతీయత లాంటివి కాపాడుకోవాలి అంటే ట్రంప్ కు ఓటేయండి అంటూ ప్రచారాలు కూడా చేస్తున్నారు. డాలస్ లాంటి ప్లేస్ లలో భారతీయ భాషల్లో బోర్డులు, బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ బోర్డులు చూసి కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధార్మిక సపోర్టర్లు ట్రంప్‌కు సపోర్ట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోందని ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి