లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హెజ్ బొల్లా తీవ్రవాద సంస్థ అధినేత హసన్ నస్రల్లా వారసుడిగా అనుకుంటున్న హసీమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడిని ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. హషీమ్ ప్రస్తుతం హెజ్ బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా వ్యవహరిస్తున్నాడు.
Israel is unleashing its most MASSIVE, most VIOLENT bombardment on Beirut yet.
— sarah (@sahouraxo) October 3, 2024
Every night now, Israel terrorizes Lebanon and massacres our people. pic.twitter.com/b6Tvua7v5Q
హసన్ నస్రల్లాకు అతను దగ్గరి బంధువు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల క్రమంలో.. ఇవాళ ఉదయం బీరుట్ లోని విమానాశ్రయం వద్ద విమానం ల్యాండ్ అయిన కొద్ది నిమిషాలకే భారీ పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. బీరుట్ విమానాశ్రయంలో దిగిన విమానం (మిడిల్ ఈస్ట్ ఎయిర్ లైన్స్ ఎంఈ 429) దుబాయ్ నుండి వచ్చినట్లు సమాచారం.
Tonight’s Israeli Airstrikes on the Southern Suburbs of Beirut are said to have Targeted a Deep-Underground Bunker utilized by Hezbollah, hiding inside of which Israeli Officials believe was the New Secretary-General of Hezbollah, Hashem Safieddine as well as his Family and… pic.twitter.com/JGMvOpwHxi
— OSINTdefender (@sentdefender) October 3, 2024
విమానాశ్రయానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న సిన్ఎల్ఫిల్ నుంచి ఈ మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. అయితే విమానాశ్రయంలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా అధికారులు ధృవీకరించలేదు. ఇజ్రాయెల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి ఓ టెలివిజన్లో మాట్లాడుతూ.. లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకోని తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) October 3, 2024
Israel launches huge wave of airstrikes in assassination attempt on Hezbollah’s new leader Hashem Safieddine pic.twitter.com/WxWkPOFCjv
టెర్రరిస్ట్ గ్రూపులను వాటి స్థావరాలను తిరిగి స్థాపించుకునే అవకాశం ఇవ్వకుండా తమ దాడులు ఉంటాయని పేర్కొన్నాడు. భవిష్యత్తులో హెజ్ బొల్లాను ఈ ప్రదేశాలలో స్థాపించడానికి మేము అనుమతివ్వము. హెజ్ బొల్లా కు వ్యతిరేకంగా తీవ్రమైన దాడులు అన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయని చెప్పారు.
ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. హెజ్ బొల్లా సీనియర్ నాయకుల సమావేశం జరిగిన బంకర్ పై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో హెజ్బొల్లా కొత్త అధిపతి, హసన్ నస్రల్లా సోదరుడు హషీమ్ సఫీద్దీన్ మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.
Also Read: తిరుపతి లడ్డూ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. సీబీఐ విచారణకు ఆదేశాలు