ఉఫ్ ఉఫ్.. కీప్యాడ్ ఫోన్ ధరకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. కేవలం రూ.2వేలే!

పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.11,999 కాగా ఇప్పుడు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి కేవలం రూ.2,099లకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో అధునాతన ఫీచర్లు కూడా అందించబడ్డాయి.

New Update
poco m6,

హమ్మయ్య ఇన్నాళ్లకు 5జీ ఫోన్ కొనుక్కునే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు వేలకు వేలు ఖర్చుపెట్టి స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కునే వారిని చూశాం. కానీ కేవలం రూ.2వేలకే ఫోన్‌ కొనుక్కున్నారా? అదీ 5జీ స్మార్ట్‌ఫోన్. నిజమేనండీ బాబు. సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.2 వేలకే కొనుక్కోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే? కీప్యాడ్ ఫోన్ ధరకే ఒక 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేస్తున్నాం అని మాట. రండి దీని కథేంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

Also Read: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ!

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్ ఉంది. ఇప్పుడందరూ 5జీ ఫోన్లు పైనే ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి కొన్ని కంపెనీలు తక్కువ ధరకే తమ ఫోన్లను అమ్మేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం పోకో తన 5జీ ఫోన్‌ని తక్కువ ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో ఉంచింది. 

Also Read: ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..

POCO M6 5G

POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ అందించింది. దీని 4/64జీబీ వేరియంట్ అసలు ధర లాంచ్ సమయంలో రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో 33 శాతం డిస్కౌంట్‌ అంటే రూ.4000 తగ్గింపుతో కేవలం రూ.7,999లకే లిస్ట్ అయింది. 

Also Read: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ!

దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అది లేకపోతే అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్లపై రూ.500 డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

Also Read: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

దాదాపు రూ.5,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లు కలుపుకుంటే POCO M6 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,099లకే లభిస్తుంది. అందువల్ల ఒక మంచి 5జీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు