/rtv/media/media_files/2025/02/21/7kQenqkLFw4mEk0Baqfa.jpg)
Phonepe Photograph: (Phonepe)
ఇప్పటికే పలు సంస్థలు ఐపీఓలోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే తాజాగా ఫోన్‌పే కూడా ఐపీఓలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఫోన్‌పేను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫోన్‌పే ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోబోతుంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే పదేళ్ల తర్వాత ఐపీఓలోకి వస్తోంది. ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు ఫోన్ పే తెలిపింది.
ఇది కూడా చూడండి: Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
Startup IPO Alert 🚀
— Young Turks (@CNBCYoungTurks) February 20, 2025
Fintech giant @PhonePe starts to prepare for a public listing in India as it marks its 10th year
The fintech moved domicile to India in Dec 2022#IPO #startup pic.twitter.com/63GkRcnOSF
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..సూపర్ గా ముందుకు దూసుకుపోండి!
ప్రధాన కార్యాలయాన్ని మార్చి..
ఎప్పటి నుంచి ఐపీఓ ప్రారంభమవుతుందనే విషయం తెలియదు. ఫోన్ పే కంపెనీ 2023 ఆదాయం 12 బిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.1.04 లక్షల కోట్లు. అయితే ఫోన్ పే కంపెనీ 2022లో ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చింది. దీనికోసం ప్రభుత్వానికి కూడా రూ.8000 కోట్లు చెల్లించింది.
ప్రస్తుతం ఫోన్‌పే భారత యూపీఐ మార్కెట్‌లో 48 శాతం వాటా ఉంది. దీని తర్వాత గూగుల్ పే 37 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఫోన్ పే ఆదాయం 73 శాతం పెరిగింది.