/rtv/media/media_files/2025/09/05/online-tutoring-2025-09-05-12-27-42.jpg)
online tutoring
ఉద్యోగం లేక కొందరు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం సంపాదించాలన్నా చాలా కష్టం. అయితే డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో నిజాయితీగా కష్టపడి పనిచేస్తే డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఉద్యోగం లేని వారు తక్కువ బడ్జెట్‌తో డబ్బులు సంపాదించడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Telangana: ఓరి కామాంధుడా.. రెండేళ్ల చిన్నారిపై రేప్ - నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఆన్‌లైన్ ట్యూటరింగ్
గణితం, ఇంగ్లీషు, కంప్యూటర్స్, సైన్స్ వంటి వాటిపై పట్టు ఉన్నవారు ఇంట్లో ఉంటూ బోధించవచ్చు. ఇలా గంట సమయం బోధించి దానికి తగ్గ డబ్బులు తీసుకుంటే మీరు లక్షల్లో సంపాదించవచ్చు. అయితే దీనికి పెద్దగా పెట్టుబడి ఏంటి పెట్టక్కర్లేదు. తక్కువ పెట్టుబడితో ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్, నెట్ వర్క్ ఉంటే అసలు డబ్బులు అవసరం లేదు. ఈ మూడు ఉంది నెట్‌వర్క్ సమస్యలు లేకుండా ఉంటే వీడియో కాలింగ్ టూల్స్ ద్వారా మీరు ట్యూటిరింగ్ చేసుకోవచ్చు. జూమ్, గూగుల్ మీట్ వంటి ద్వారా మీకు ఫ్రీ ఉన్న సమయాన్ని బట్టి బోధించవచ్చు. అయితే వీటి కోసం మార్కెటింగ్ చేసుకోవడానికి కొంత ఖర్చు చేయాల్సి ఉంది.
రోజుకి మూడు గంటలు బోధిస్తే..
మీరు ఈ ఆన్‌లైన్ ట్యూటరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించాలంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండాలి. వారి బట్టి మీకు నెలకు లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏ సబ్జెట్‌లో అయితే నిపుణులో అందులో బోధించడానికి గంటకు రూ.400 నుంచి రూ.1500 వరకు తీసుకోండి. మీరు రోజులో కనీసం ఒక 5 లేదా 6 గంటల పాటు బోధిస్తే మీరు ఈజీగా నెలకు రూ.30 వేలు సంపాదివచ్చు. అయితే మీరు రోజూ చెప్పే క్లాసెస్ బట్టి ఉంటుంది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది బయటకు వెళ్లలేక ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్నారు.
సొంతంగా వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుంటే..
స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అన్నింటికి కూడా ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ తీసుకుంటారు. మీరు దీన్ని వృత్తిగా మార్చుకుంటే లక్షలు సంపాదించవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో క్లాసులు బోధించాలంటే Chegg, TutorMe, UrbanPro వంటి ఫ్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవాలి. వీటిలో పెద్దగా లాభం రావడం లేదని అనుకుంటే సొంత వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నా లాభాలు వస్తాయి. అయితే వెబ్‌సైట్ కొత్తగా పెట్టడం వల్ల మీకు బడ్జెట్ పెరిగిపోతుంది. తక్కువ మొత్తంలో పెట్టుకోవాలనుకునే వారు డబ్బులు వచ్చిన తర్వాత వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: Crime: కరీంనగర్ మెడికల్ కాలేజీలో కలకలం.. బుర్కాతో మహిళల బాత్రూంలోకి దూరి..!