OnePlus స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్ అదిరింది.. తక్కువకే కొనేయొచ్చు! అమెజాన్‌లో OnePlus Nord CE 4 ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తుంది. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,499గా ఉంది. దీనిపై రూ.500 కూపన్ తగ్గింపు, బ్యాంకుల కార్డులపై రూ. 1500 ఫ్లాట్ తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో ఫోన్‌ను రూ. 21,499కే కొనుక్కోవచ్చు. By Seetha Ram 12 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్‌లో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.20 వేలలో ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలని అనుకున్నట్లయితే ఇదే చక్కటి అవకాశం. ఇ-కామర్స్ సైట్‌లో OnePlus Nord CE 4పై ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందొచ్చు. OnePlus Nord CE 4 offers అమెజాన్‌లో OnePlus Nord CE 4లోని బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర అమెజాన్‌లో రూ. 24,999కి ప్రారంభించబడింది. ఇప్పుడు ఇది రూ. 23,499కి లిస్ట్ అయింది. ఇది కూడా చదవండి: ఓలా బంపరాఫర్.. చీప్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్! అయితే సేల్ సమయంలో కూపన్ ఆఫర్ నుండి రూ.500 ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా వివిధ బ్యాంకుల కార్డుల చెల్లింపులపై రూ. 1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో వన్‌ప్లస్ ఫోన్ రూ. 21,499 కి లభిస్తుంది. OnePlus Nord CE 4 specifications OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Android 14 ఆధారంగా OxygenOS 14 పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కూడా చదవండి: ఆఫర్ అరాచకం.. ఐఫోన్ 15 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్..! వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ Sony LYT600 ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ Sony IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. #tech-news-telugu #mobile-offers #oneplus-nord-phone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి