Budget 2026: వేతన జీవులకు నిరాశ.. ఆదాయపు పన్నుపై మార్పులు లేకుండా బడ్జెట్

2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.

New Update
New Income Tax Act will come into effect on April 1, 2026, Says FM Nirmala Sitharaman

New Income Tax Act will come into effect on April 1, 2026, Says FM Nirmala Sitharaman

2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపుపై ఎన్నో ఆశలు పెట్టకున్న వేతన జీవులకు నిరాశే ఎదురయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా పన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. కానీ విధానపరమైన అంశాల్లో మాత్రం కాస్త ఊరట దక్కింది. ITR1,ITR 2 ఫైలింగ్‌కు జులై 31 వరకు గడువు విధించారు. నాన్‌ ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్ట్‌లు ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఇక రివైజ్డ్‌ ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. 

2025లో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి వాస్తవ రూపంలోకి వెళ్తుందని నిర్మలా సీతారమన్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఆదాయపు పన్ను రూల్స్‌ను మరింత సులభతరం చేసినట్లు చెప్పారు. త్వరలోనే దీన్ని నోటిఫై చేస్తామని తెలిపారు. పన్ను చెల్లింపుదారులు, కొత్త చట్టాన్ని అర్థం చేసుకోని వాళ్లని సమయం ఇస్తామన్నారు. ఇక కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.  

Also Read: బడ్జెట్లో నిర్మలమ్మ ఏం చెప్పింది.. స్టాక్ మార్కెట్ క్రాష్‌కు కారణం అదేనా?

 సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(STT)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఫ్యూచర్స్‌పై ఈ పన్నును 0.02 నుంచి 0.05 శాతానికి పెంచింది. ఆప్షన్స్‌ ప్రీమియంపై 0.15 శాతానికి పెంచింది. ఇక షేర్ల బైబ్యాక్‌లను క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణించి ట్యాక్స్‌ విధిస్తామని నిర్మలా సీతారమన్ తెలిపారు. స్టూడెంట్స్, , టెక్‌ ప్రొఫెషనల్స్‌, రీలొకేటెడ్‌ NRIల వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆరు నెలల పాటు ఫారిన్ అసెట్స్‌ డిస్‌క్లోజర్‌ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.

NRIల ఆస్తుల విక్రయంపై టీడీఎస్‌ కోసం రూల్స్‌ను తీసుకొచ్చారు. స్థిరాస్తి విక్రయాలపై స్థానిక కొనుగోలుదారుల నుంచి TDSను వసూలు చేస్తారు. అలాగే విదేశీ టూర్‌ ప్యాకేజీలపై TDSను 5 శాతం, 20 శాతం నుంచి 2 శాతానికి కుదించారు. మోటార్‌ యాక్సిడెంట్లలో వచ్చే క్లెయిమ్‌లపై కూడా ఆదాయపు పన్నును ఎత్తివేశారు. 

Also Read: ఆరోగ్య రంగానికి రూ.10,000 కోట్లు.. బయోఫార్మా హబ్‌గా భారత్!

Advertisment
తాజా కథనాలు