Netflix లో అదిరిపోయే ఫీచర్.. సేవ్ చేసుకుంటే మళ్లీ చూసుకోవచ్చు

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నచ్చిన సన్నివేశాన్ని సేవ్ చేసుకుని, మళ్లీ చూసుకోవచ్చు. అలాగే స్క్రీన్‌స్కాట్‌లను కూడా తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకోవచ్చు.

New Update
New featuree

ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా నడుస్తోంది. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసేంత సమయం లేని వాళ్లు ఎక్కువగా ఓటీటీలోనే చూస్తున్నారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!

నచ్చిన సీన్ సేవ్ చేసుకుంటే..

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న  సినిమాలు, షోలలో మీకు ఇష్టమైన సీన్‌లను సేవ్ చేసుకుని మళ్లీ నచ్చినప్పుడు చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

 మీకు నచ్చిన సీన్‌ను సేవ్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక సన్నివేశాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఆటోమేటిక్‌గా కస్టమ్ స్క్రీన్‌షాట్‌ను తీస్తుంది. ఇది షో పేరు, ఎపిసోడ్, సన్నివేశం అన్ని వివరాలు ఉంటాయి. ఇలా సేవ్ చేసుకున్న వాటిని మళ్లీ మళ్లీ చూసుకోవచ్చు. గతంలో స్క్రీన్‌షాట్లు తీసుకోవడానికి వీలు కుదరదు. కానీ ఈ కొత్త ఫీచర్‌ ద్వారా స్క్రీన్‌షాట్లు తీసుకుని సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్

ఈ ఫీచర్‌ను సెట్ చేసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా సినిమా లేదా షో చూసేటప్పుడు దానిని క్యాప్చర్ చేయాలంటే.. స్క్రీన్‌పై ట్యాప్ చేయాలి. వెంటనే ప్లేయర్ ఇంటర్ ఫేస్‌లో ఆ సీన్ సేవ్ చేసుకోవాలనే ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే సేవ్ చేసుకుంటే మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లో సేవ్ అవుతుంది. ఇలా మీకు నచ్చినప్పుడు మళ్లీ ఆ సీన్‌ను చూసుకోవచ్చు. మొదట కేవలం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. 

ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు