Stock Markets : లాభాల వద్ద ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌,  ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ప్రసుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

New Update
Stock Markets

Stock Markets Today : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో మిశ్రమ సూచీలు ఉన్నాయి. కానీ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి 82,149 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉండగా నిఫ్టీ 43 పాయింట్లు లాభంతో 25,172 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే డాలర్‌తో చూసుకుంటే రూపాయి మారకం విలువ 2 పైసలు పెరిగి 84.07 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చూడండి: Yadadri: యాదాద్రి లడ్డూ నెయ్యి స్వచ్ఛమైనదా? పరీక్ష రిజల్ట్స్?

ఈ షేర్లు లాభాల్లో..

సెన్సెక్స్ సూచీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌,  ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌ షేర్లు ప్రసుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, నెస్లేఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభం 5 శాతం క్షీణించి రూ.16,563 కోట్లుగా నమోదైంది. ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం వల్ల రిలయన్స్ నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది. హెచ్‌సీఎల్‌ నికర లాభం 10 శాతం పెరిగి రూ. 4,235 కోట్లకు చేరింది. దేశీయ బ్రోకరేజ్ ఏంజెల్ వన్ ఏకీకృత నికర లాభం రూ. 423 కోట్లు వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 39 శాతం పెరిగింది.

ఇది కూడా చూడండి: శ్రీలీల పాత్రలో నేషనల్ క్రష్.. ఫ్యాన్స్ కు పండుగే!

ఇదిలా ఉండే ఈ రెండో త్రైమాసికంలో డీమార్ట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.27 వేల కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయి. ఈ మేరకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి వెల్లడించిన ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో డీమార్ట్ విఫలమయ్యాయి. 

ఇది కూడా చూడండి:  BIG BREAKING: టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా!

Advertisment
Advertisment
తాజా కథనాలు