/rtv/media/media_files/2025/12/23/microsoft-2025-12-23-18-59-36.jpg)
Microsoft to replace all C and C++ code with Rust, hints 1 engineer must write 1 million lines every month
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది. అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఆ సంస్థలోని సీనియర్ ఇంజినీర్ గాలెన్ హంట్ ఈ విషయాన్ని తన లింక్టిన్ ప్రొఫైల్‌లో రాసుకొచ్చారు.
Also read: విజయ్ మాల్యా, లలిత్ మోదీపై ఉన్న ఆరోపణలు ఏంటి ? భారత్ వీళ్లను ఎందుకు రప్పించలేకపోతోంది ?
''ఒక నెలలో 10 లక్షల లైన్లతో కోడ్ రాయాలని సంస్థ ఆశిస్తోంది. పాత కోడ్‌ను తిరిగి రాయడం సాధారణ విషయం కాదు. వేల లైన్లు రాసేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు అంటుంటారు. అందుకే మైక్రోసాప్ట్ ఆ అభిప్రాయాన్ని మార్చే దిశగా యత్నిస్తోంది. ఏఐ ఏజెంట్లతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తోంది. ఇప్పటికే కోడ్ ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిందని'' ఇంజినీర్ గాలెన్ హంట్ వెల్లడించారు.
Also Read: బంగ్లాదేశ్ బలుపు శేష్ఠలు.. రాయబార కార్యాలయానికి సమన్లు
Follow Us