Gummadi Narasaiah : గుమ్మడి నర్సయ్యగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్!

సామాన్య జీవితాన్ని గడుపుతూ, పేద ప్రజల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' అనే బయోపిక్‌ తెరకెక్కుతుంది.

New Update
gummadi

సామాన్య జీవితాన్ని గడుపుతూ, పేద ప్రజల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' అనే బయోపిక్‌ తెరకెక్కుతుంది. ఇందుకు సంబంధించి ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.  ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్య పాత్రలో కన్నడ స్టార్ హీరో,  కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్నారు.

సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన గుమ్మడి

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబరంగా సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్‌కుమార్‌ ఒదిగిపోయినట్లుగా ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సాధారణ వేషధారణ, ఎర్ర కండువాతో సైకిల్ పక్కన నిలబడి ఉన్న శివ రాజ్‌కుమార్‌ లుక్ అద్భుతంగా ఉందని సినీ, రాజకీయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో అసెంబ్లీ భవనం, కార్లు నిలిచి ఉండగా.. మధ్యలో సైకిల్‌తో గుమ్మడి నర్సయ్య పాత్రధారి శివ రాజ్‌కుమార్‌ నిలబడిన దృశ్యం పోస్టర్‌కు హైలైట్‌గా నిలిచింది.

పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్‌, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.గుమ్మడి నర్సయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని తెరపై చూపించడానికి చిత్రబృందం ఎంతో కృషి చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు