ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది ఆన్‌లైన్‌లోనే వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కూర్చున్న ప్లేస్ నుంచి కదలకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చేస్తుంది. వచ్చిన ఐటెమ్ మనకి నచ్చకపోతే మళ్లీ రిటర్న్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. దీన్నే అనుకూలంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన మీషో కంపెనీకి ఏకంగా రూ.5 కోట్లకు పైగా టోకరా వేశారు.
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!
ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?
ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి..
ఫేక్ అకౌంట్ల క్రియేట్ చేసి కొందరు సైబర్ నేరగాళ్లు యాప్‌లో వస్తువులను ఆర్డర్ చేసేవారు. వచ్చిన ఐటెమ్‌లు ఉంచుకుని వారి దగ్గర విరిగిపోయి ఉన్న వస్తువులను రిటర్న్ చేసేవారు. సాక్ష్యాల కోసం ఫొటోలను కూడా పెట్టేవారు. ఇలా సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. కేవలం జనవరి నుంచి జులై వరకు మొత్తం రూ.5 కోట్లకు పైగా కాజేశారని మీషో తెలిపింది.
ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు!
కంపెనీలో ఉన్న ఓ అధికారి దీన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయట పడింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!