ప్రముఖ టెక్ బ్రాండ్ లావా కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది Agni 2 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఆ ఫోన్‌కి అప్డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ Agni 3 5G ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. ఇంకా అధునాతన ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం.
Lava Agni 3 5G Price
లావా అగ్ని 3 5జీ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే.. ఇది రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర (ఛార్జర్ లేకుండా) రూ. 20,999 గా నిర్ణయించారు. అదే వేరియంట్ (ఛార్జర్‌తో) రూ. 22,999గా ఉంది. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.24,999 ధరతో అందుబాటులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!
ఈ ఫోన్ ప్రిస్టైన్ గ్లాస్, హీథర్ గ్లాస్ వంటి కలర్ ఆప్షన్‌లలో వచ్చింది. ఈ ఫోన్‌పై ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్న సేల్‌లో కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. దీనిపై భారీ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. సేల్ ఆఫర్ కింద ప్రతి మోడల్‌పై రూ.2000 డిస్కౌంట్, ఛార్జర్ లేకుండా రూ.1000 తగ్గింపు పొందవచ్చు.
Lava Agni 3 5G Specifications
లావా అగ్ని 3 5జీ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో ప్రధాన డిస్‌ప్లేతో డ్యూయల్ AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి ఫోన్‌గా అందుబాటులోకి వచ్చింది. అలాగే 1.74 అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ 4ఎన్ఎమ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫోన్ సేఫ్టీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. అలాగే 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇంకా కెమెరా విషయానికొస్తే.. ఇది వెనుక భాగంలో ఓఐఎస్ మద్దతుతో 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే వాటర్ అండ్ డస్ట్ రెసస్టెన్సీ కోసం ఐపీ64 రేటింగ్‌తో వచ్చింది.