Apple సంస్థకు కాకినాడలో రూ.లక్ష జరిమానా.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

ప్రముఖ సంస్థ యాపిల్ కంపెనీకి కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది. మొబైల్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అనే యాడ్‌తో ఓ యువకుడు మోసపోయాడని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేయగా.. దీనిపై కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

New Update
Apple iPhone 15 Launch: USB టైప్ C పోర్ట్‎తో ఐఫోన్ 15 సిరీజ్ రిలీజ్..ధర, ఫీచర్లు ఇవే..!!

కాకినాడ వినియోగదారుల కమిషన్ ప్రముఖ సంస్థ యాపిల్ కంపెనీకి జరిమానా విధించింది. ఐఫోన్ కొనుగోలు చేస్తే ఇయర్ పాడ్స్ ఫ్రీ అనే ప్రకటనను చూసి ఓ యువకుడు మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యారావు పేటకు చెందిన చందలాడ పద్మరాజు మూడేళ్ల క్రితం యాపిల్ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో ఐఫోన్ కొనుగోలు చేశాడు. రూ.85,800ల ఐఫోన్ కొంటే రూ.14,900 ఇయర్ పాడ్స్ ఉచితంగా ఇస్తామని కంపెనీ యాడ్ ప్రకటించింది. ఈ ప్రకటనను చూసి ఆర్డర్ పెట్టగా కేవలం మొబైల్ మాత్రమే వచ్చిందని యువకుడు ఆరోపించాడు. 

ఇయర్ పాడ్స్ లేదా నగదు 

ఈ విషయంపై ఆ యువకుడు యాపిల్ సంస్థ కస్టమర్‌ కేర్‌కి సంప్రదించిన ఎవరూ స్పందించలేదు. దీంతో వినియోగదారుల కమిషన్‌‌కి ఫిర్యాదు చేశాడు. మూడేళ్ల క్రితం చేసిన ఈ ఫిర్యాదుపై వినియోగదారుల కమిషన్ విచారణ చేపట్టి యాపిల్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ డబ్బు మొత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. బాధితుడు ఆర్డర్ పెట్టుకున్న ఇయర్ పాడ్స్ లేదా నగదు, మానసికంగా వేదన చెందినందుకు రూ.10 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.5 వేలు ఇవ్వాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ముంబాయిలో ఉన్న యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు వినియోగదారుల కమిషన్ ఈ జరిమానా విధించింది. 

ఇది కూడా చూడండి:  Tamilnadu: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

Advertisment
Advertisment
తాజా కథనాలు