వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది.

Stock Markets
New Update

ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు కూప్పకూలుతున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా చమురు బ్యాంకింగ్, వాహన షేర్లలో సెన్సెక్స్ భారీగా పడిపోయింది. విదేశీ అమ్మకాలు కావడం, ముడి చమురుపై ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. 

ఇది కూడా చూడండి: Paracetamol: పారాసిట్మాల్‌ ను అధికంగా వాడితే ఇక అంతే సంగతలు!

ఈ ఏడాది అతిపెద్ద పతనం..

ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 దగ్గర ప్రారంభమైంది. ప్రారంభంలో లాభాలను తెచ్చిన సూచీ 83,752.81 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసిన చివరకు 82,497.10 వద్ద ఆగిపోయింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌కు మూడో అతిపెద్ద పతనం ఇదే. ట్రేడింగ్ మొదట్లో సెన్సెక్స్ 354 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయాయి. ప్రస్తుతానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 158 పాయింట్లు నష్టపోయింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 64 పాయింట్లు కోల్పోయి 25,186 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చూడండి: మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.!

ప్రస్తుతం ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టాటా మోటార్స్, టైటాన్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకుల స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏసియన్ పెయింట్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, నెస్లే ఇండియా, రిలయన్స్, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: మహా కిలాడీలు.... నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్ పేరుతో లక్షల్లో టోకరా!

#stock-market #israel #iran
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe