iPhone 15 Offer: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.25,000లకే ఐఫోన్ 15! ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 కేవలం రూ.25,299లకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఈ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,900 కాగా రూ.58,249కి కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.11,651 తగ్గింపు లభించిందన్నమాట. By Seetha Ram 26 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఐఫోన్ వాడాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా దాన్ని కొనాలంటేనే కాస్త వెనక్కి జంకుతారు. ఎప్పుడైనా ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కుందాంలే అని తమ ప్లాన్‌ను మార్చుకుంటారు. అలాంటి వారికి అదిరిపోయే వార్త. మీరు నచ్చిన.. మీరు మెచ్చిన ధరలో ఇప్పుడు ఐఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. Also Read: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి! భారీగా తగ్గిన ఐఫోన్ 15 ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర చాలా తగ్గింది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో దాదాపు రూ.70,000 ఉంది. కానీ ఇప్పుడు దీని ధర చాలా వరకు పడిపోయింది. అందుకు కారణం ఐఫోన్ 16 సిరీస్ రావడమే. దీని వల్లనే ఐఫోన్ 15 ధర భారీగా తగ్గిపోయింది. Also Read: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .. ప్రకటించిన నాగార్జున ఇప్పుడు ఈ ఐఫోన్ 15 కేవలం రూ. 58 వేలకే లభిస్తుంది. అవునండీ మీరు విన్నది నిజమే. దీని అసలు ధర రూ.69,900 కాగా ఇప్పుడు ఆఫర్‌లో దీనిని రూ.58,249కి కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.11,651 తగ్గింపు లభించిందన్నమాట. అంతేకాకుండా దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. Also Read: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. దాదాపు రూ.32,950 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే.. ఐఫోన్ 15ను కేవలం రూ.25,299లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ 128 జీబీ వేరియంట్‌కు మాత్రమే లభిస్తుంది. ఆసక్తి గల కస్టమర్లు దీనిని ఆఫర్లతో కొనుక్కోవచ్చు. Also Read: HYD: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం...ఇంకా అదుపులోకి రాని మంటలు . . . . #iphone-15 #flipkart #mobile-offers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి