Infosys Lays Off : ఇన్ఫోసిస్‌లో లేఆఫ్‌లు.. 40 మందిని పంపించేసింది!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌- లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆఫీసులో 40 మంది ట్రైనీల తొలగించింది.  ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించింది.

New Update
infosys layoff

infosys layoff

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌- లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆఫీసులో 40 మంది ట్రైనీల తొలగించింది.  ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించింది. ఇన్ఫోసిస్ అదే క్యాంపస్ నుండి దాదాపు 350 మంది ట్రైనీలను తొలగించిన సంగతి తెలిసిందే.  ఈ నిర్ణయంపై  తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) దాకా వెళ్లడంతో కేంద్ర కార్మిక శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.

Also read :  Chiyaan Vikram: ఇలా జరిగిందేంటి.. రిలీజ్ వేళ షోలన్నీ రద్దు! చిక్కుల్లో విక్రమ్ సినిమా

Also read :  Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు

ఇన్ఫోసిస్ కొత్త ఆఫర్

ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కొత్త ఆఫర్ ఇచ్చింది. లేఆఫ్‌కు గురైన ట్రైనీలకు బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్మెంట్‌ (BPM) రోల్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో 12 వారాల  పాటు శిక్షణ కూడా అందిస్తుంది. అలాగే,తొలగించిన ట్రైనీలకు రిలీవింగ్ లెటర్‌ తో పాటుగా ఒక నెల ఎక్స్‌గ్రేషియా కూడా అందించేందుకు ఇన్ఫోసిస్‌- సిద్ధమైంది. అయితే దీనిని ఇష్టపడని ట్రైనీలకు కంపెనీ మరో ఆఫర్ కూడా ప్రకటించింది.   మైసూరు నుంచి బెంగళూరుకు రవాణాతో పాటు వారు తమ స్వస్థలానికి చేరుకోవటానికి అయ్యే ప్రయాణ ఖర్చులను భరిస్తుంది.  క్యాంపస్ వీడాలనుకునే వారు మార్చి 27లోపు కంపెనీకి తమ నిర్ణయం తెలియజేయాలని ట్రైనీలకు ఇన్ఫోసిస్‌- సూచించింది.

Also read :  Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టిండి!

Advertisment
తాజా కథనాలు