ఈరోజ రూపాయి విలు 0.3 శాతం క్షీణించింది. దాని వలన రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే 85.8075 కనిష్ట స్థాయికి పడిపోయింది. 2024 జూన్ 4 తర్వాత ఇంత దారుణంగా రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి. గత 8 వారాలుగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది. బెంగ అక్కర్లేదు.. అయితే ఇక్కడ ఒక మంచి విషయ కూడా ఉంది. ఏడు నెలల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయినప్పటికీ ఇదేమీ డ్రాస్టిక్ ఛేంజ్ కాదు అలాగే ఇతన మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి స్థిరంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఏప్రిల్ 2024 నుండి భారత రూపాయి కేవలం 1.2% మాత్రమే బలహీనపడింది. కానీ దక్షిణ కొరియా విన్ 2.2%, బ్రెజిలియన్ రియల్ 12.7% క్షీణించింది. దీని ప్రకారం G20 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి తక్కువ అస్థిరతను చూపిస్తూ ముందుకు సాగుతోంది. రూపాయి విలువ పడిపోవడానికి గల కారణాలలో వాణిజ్య లోటు ఈ సంవత్సరం 37.8 బిలియన్ డాలర్లకు ఒకటి. ఈ కారణంగా రూపాయి నవంబర్‌లో రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రపంచ వాణిజ్యంలోని అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి ప్రధాన కారణాలు అని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. Also Read: USA: ఇండియన్స్ బిగ్ షాక్ ఇవ్వనున్న ట్రంప్..మరో 18వేల మంది..