Share Market:
ఈరోజు ఉదయం ఫ్లాట్‌గా మొదలైన దేశీ మార్కెట్ చాలా తొందరగానే ఊపు అందుకుంది. కొద్ది సేపటికే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేసుకున్నాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు ఉన్నా...మన మార్కెట్ మాత్రం తన స్పీడును కంటిన్యూ చేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్‌ల మోత మోగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 666 పాయింట్లు లాభపడి 85, 836 పాయింట్లు దగ్గర ఉండగా నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 26, 216 దగ్గర ముగిసింది. రూపాయితో డాలర్ మారకం విలువ 83.60 దగ్గర ముగిసింది.
వరుసగా 7వ రోజు ఆల్ టైమ్ హైని నమోదు చేసింది.
30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 26 పెరగ్గా.. 4 క్షీణించాయి. ఇక నిఫ్టీలో 50 స్టాక్స్‌లో 41 పెరగ్గా 9 క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఇ సెక్టోరల్ ఇండెక్స్ లో.. ఆటో రంగ షేర్లు అత్యధికంగా పెరిగాయి. ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు పెరిగాయి..
మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐటీసీ మార్కెట్‌లో అత్యధికంగా లాభపడ్డాయి. అయితే, లార్సెన్ & టూబ్రో, NTPC మాత్రం మార్కెట్‌ను క్రిందికు లాగాయి. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 2.79%, హాంకాంగ్‌లోని హ్యాంగ్‌సెంగ్ సూచీ 4.16% చొప్పున పెరగ్గా.. చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 3.61% పెరిగింది. మరోవైపు సెప్టెంబర్ 25న అమెరికా డోజోన్స్ 0.70% పడిపోయి 41,914 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.043% పెరిగి 18,082కి చేరుకుంది. S&P 500 0.19% పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం.. విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 25న రూ.973.94 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ కాలంలో దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,778.99 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read : ఎవరీ హర్ష సాయి? యూట్యూబ్ లో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లా..!