Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్‌ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

hYUNDAI
New Update

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రారంభమైంది. అక్టోబర్ 15 మంగళవారం నుంచి మొదలైన ఈ హ్యుందాయ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ 18 శాతం సబ్‌స్క్రైబ్ అయ్యింది. అయితే అక్టోబర్ 17 వరకు ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక్కో షేర్‌ను హ్యుందాయ్ రూ.1,865 నుంచి రూ.1,960గా నిర్ణయించింది. ఒక్క రోజుకే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారత్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌తో ఐపీఓకు రూ.8,315 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..!

మొత్తం ఐపీఓ షేర్లు..

ఎల్‌ఐసీ ఐపీవో విలువ గతంలో రూ.21,000 కోట్లు ఉండేది. కానీ హ్యుందాయ్ ప్రస్తుతం ఐపీవో విలువ రూ.27,870 కోట్లు ఉంది. దేశంలో పేటీఎం మాతృసంస్థ 2021 నవంబర్‌లో రూ.18,300 కోట్ల ఐపీఓను తీసుకురాగా.. కోల్ ఇండియా లిమిటెడ్ 2010 అక్టోబర్‌లో రూ.15,199 కోట్ల ఐపీఓను ప్రారంభించింది. రిలయన్స్ పవర్ 2008 జనవరిలో రూ.11,563 కోట్ల ఐపీఓను ప్రారంభించింది. హ్యుందాయ్ మొత్తం ఐపీఓ రూ.27,870 కోట్లలో 9.97 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచారు.

ఇది కూడా చూడండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

ఇందులో 1.77 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. అయితే 26 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లు, 13 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, 5 శాతం క్యూఐబీ కోటా చొప్పున హ్యుందాయ్ సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. హ్యుందాయ్ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో రూ.40 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. 2 శాతం ప్రీమియంతో హ్యుందాయ్ మోటార్ షేరు రూ.2000 వద్ద లిస్ట్ కావచ్చు. అయితే ఇప్పటివరకు గ్రే మార్కెట్లో ఈ స్టాక్ 92 శాతం పడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 27 నుంచి ఈ షేర్లు గ్రే మార్కెట్లో పతనమవుతున్నాయి. సెప్టెంబర్ 27న రూ.570లకు ఈ షేర్లు లభ్యమయ్యాయి. 

ఇది కూడా చూడండి: Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు

ఇదిలా ఉండగా మదుపర్లు కనీసం 7 లాట్లకు అనగా..రూ.13,720కు చేసుకోవాల్సి ఉండగా, గరిష్ఠంగా 14 లాట్లకు రిటైల్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా కూడా ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూ వరల్డ్ ఫండ్ ఇంక్, ఫిడిలిటీ ఫండ్స్, సింగపూర్ సర్కార్, జేపీ మోర్గాన్ ఫండ్స్, బ్లాక్ రాక్ గ్లోబల్ ఫండ్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి కంపెనీలు షేర్లను కేటాయించిన యాంకర్ ఇన్వెస్టర్లలో ఉన్నాయి. అయితే పూర్తిగా ఓఎఫ్ఎస్‌పై ఈ ఐపీఓ ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చూడండి:  Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్!

 

#investment #ipo #share-market-today #hyundai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe