/rtv/media/media_files/2025/09/14/gst-news-2025-09-14-11-28-45.jpg)
ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను చేసింది. అందులో భాగంగా జీఎస్టీస్లాబ్ రేట్లలో మార్పులు చేసింది. సెప్టెంబర్ 22 నుంచి కేవలం 5, 18 శాతం మాత్రమే జీఎస్టీ అమలు అవుతుందని చెప్పింది. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇందులో టీవీల వంటి లగ్జరీ వస్తువులతో పాటూ చిన్న చిన్నబిస్కెట్లు, చిప్స్ పేకెట్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 5, 10, 20 రూపాయల చిప్స్, కుర్కురే, బిస్కెట్లు, నామ్‌కీన్, సబ్బు, టూత్‌పేస్ట్ ధరలో మార్పు ఉంటుందా లేదా అే దానిపై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై తాజాగా ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు కీలకమైన సమాచారాన్ని ఇచ్చాయి.
ధరలను తగ్గించడం లేదు..
రూ. 5 బిస్కెట్లు, రూ.10 సబ్బు లేదా రూ.20 టూత్‌పేస్ట్ ప్యాక్‌ల వంటి ప్రముఖ తక్కువ ధర ఉత్పత్తులపై వస్తువులపై జిఎస్‌టి తగ్గినప్పటికీ.. వాటి ధరలను మాత్రం తగ్గించలేమని ఎఫ్‌ఎంసిజి కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే...కొనుగోలుదారులు ఈ స్థిరమైన , తక్కువ ధరలకు ఇప్పటికే చాలా ఏళ్ళగా అలవాటు పడ్డారని...వాటి ధరలను ఇప్పుడు రూ.18 లేదా రూ.9 లకు తగ్గించడం వలన వారిని గందరగోళానికి గురి చేస్తుందని చెబుతున్నారు. దాంతో పాటూ డబ్బు లావాదేవీలలో కూడా అసైకర్యం కలుగుతుందని తెలిపాయి. ప్రస్తుతం రూపాయి, రెండు రూపాయలు చెలామణిలో నా చాలాచోట్ల చిల్లర దొరకడం కష్టం అయిపోతోంది. ఐదు రూపాయలకే చిల్లర లేక వాటి బదులు చాకెట్ల లాంటి వస్తువులు ఇస్తున్నారు. అలాంటిది రూపాయి, రెండు రూపాయలు అస్సలు దొరకవని కంపెనీలు చెబుతున్నాయి.
ప్యాకెట్ సైజ్ పెరుగుతుంది..
అందుకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్టాక్సెస్ అండ్ కస్టమ్స్ ధరలను ఆ వస్తువులపై అలాగే ఉంచుతామని...కానీ ప్యాకెట్ లోపల పరిమాణాన్ని పెంచుతామని కంపెనీలు తెలిపాయి. ఉదాహరణకు.. రూ. 20 బిస్కెట్ ప్యాక్‌లు ఇప్పుడు అదే ధర వద్ద ఉన్నా..అందులో ఎక్కువ గ్రాముల బిస్కెట్లు ఉంటాయి. ఈ ప్యాక్‌లపై పరిమాణాన్ని పెంచడం ద్వారా, GST ప్రయోజనాలను ప్రజలకు అందజేస్తామని కంపెనీలు తెలిపాయి. దీని వలన కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలను అందిచగలుగుతామని చెబుతున్నాయి. దాంతో పాటూ రోజువారీ ఉత్పత్తులకు డిమాండ్ కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వినియోగదారులు పూర్తి ప్రయోజనం పొందేలా...కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేయడమే కాక...వాటిపై కన్నేసి ఉంచారని తెలుస్తోంది.