AI టెక్నాలజీతో గూగుల్‌ పేలో సూపర్ అప్‌డేట్.. వారు కూడా వాడొచ్చు

గూగుల్ పే వినియోగదారుల కోసం త్వరలో ఏఐ కొత్త ఫీచర్ తీసుకురానున్నారు. వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి UPI చెల్లింపులు చేసుకునే విధంగా అప్‌డేట్ తీసుకురానున్నారు. గూగుల్ పేలో వాయిస్ కమాండ్‌లను ప్రవేశపెట్టడంతో నిరక్షరాస్యులు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఈజీ అవుతాయి.

New Update
google pay

google pay Photograph: (google pay)

యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే అంటే తెలియని వారే ఉండరు. లక్షలాది మంది గూగుల్ పే వినియోగదారుల కోసం త్వరలో ఏఐ కొత్త ఫీచర్ తీసుకురానున్నారు. వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి UPI చెల్లింపులు చేసుకునే విధంగా అప్‌డేట్ తీసుకురానున్నారు. ఈ ఫీచర్ కోసం అభివృద్ధి జరుగుతోందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో గూగుల్ పే లీడ్ ప్రొడక్ట్ మేనేజర్ శరత్ బులుసు, ఈ వాయిస్ ఫీచర్ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే ప్రక్రియను చాలా సులభతరం చేస్తుందని సూచిస్తున్నారు. అయితే, ఈ ఫీచర్ గురించి వివరాలు ప్రస్తుతానికి పరిమితంగానే ఉన్నాయి.

Also Read: Breaking: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..

గూగుల్ పేలో వాయిస్ కమాండ్‌లను ప్రవేశపెట్టడంతో నిరక్షరాస్యులు కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఈజీ అవుతాయి. లోకల్ లాంగ్వేజస్‌లో కూడా వాయిస్ కమాండ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. AI ప్రాజెక్ట్‌పై గూగుల్ ఇండియన్ గవర్నమెంట్‌‌తో కలిసి పనిచేస్తున్నందున, ఈ వాయిస్ ఫీచర్ త్వరలో ప్రారంభించొచ్చు. ఈ ఫీచర్ ఆన్‌లైన్ మోసాలు, బెదిరింపుల నుండి వినియోగదారులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు