Google: గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్.. స్పామ్ మెయిల్స్‌కు చెక్ స్మామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. లాగిన్ చేయాలంటే.. షీల్డ్ ఈ మెయిల్స్ పేరుతో కొత్త ఐడీని క్రియేట్ చేసుకుని అవసరానికి వాడుకోవచ్చు. పది నిమిషాలకు ఎక్స్‌పైరీ అయిన ఈమెయిల్‌ను ఎన్నిసార్లు అయిన క్రియేట్ చేసుకోవచ్చు. By Kusuma 19 Nov 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికి కూడా మెయిల్ ఐడీ ఉంటుంది. ఏ చిన్న అవసరానికైనా, ఏదైనా లాగిన్ చేసినప్పుుడు మెయిల్ ఐడీ తప్పకుండా ఇస్తుంటారు. ఇలా చేసినప్పుడు ఎక్కువగా స్మామ్ మెయిల్స్ వస్తుంటాయి. మనకి అవరమైన మెయిల్స్ కంటే అనవసరమైనవే ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా చూడండి: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! షీల్డ్ ఈ మెయిల్ పేరుతో.. ఏదైనా మెయిల్‌ను మళ్లీ చెక్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. ఇలా స్మామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ ఒక అదిరిపోయే ఫీచర్‌ను తీసుకురానుంది. షీల్డ్ ఈ మెయిల్ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇది కూడా చూడండి: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే! ఈ షీల్డ్ ఈమెయిల్ ఫీచర్‌లో తాత్కాలికంగా ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈమెయిల్‌తో ఏదైనా యాప్, అకౌంట్‌కి లాగిన్ కావచ్చు. అయితే ఈ షీల్డ్ ఈమెయిల్ తర్వాత ఆటోమెటిక్ పోతుంది. కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుంది. మళ్లీ కావాలంటే కొత్త షీల్డ్ ఈమెయిల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి: Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉండగా ఈ ఫీచర్‌ను ఇప్పటికే యాపిల్ యూజర్లకు తీసుకొచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ స్మామ్ మెయిల్స్ వల్ల అవసరమైన మెయిల్స్ వెతకడానికి కాస్త సమయం పడుతుంది. అలా అని ఈ మెయిల్ లేకపోతే అసలు ఏ ఫ్లాట్‌ఫాంలో కూడా లాగిన్ కాలేరు. ఈ మెయిల్స్ యూజర్లు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్! #google #spam #email మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి