Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్

బంగారం ధర అసలు తగ్గేలే ల్యా అంటూ పరుగులు తీస్తోంది. ఈరోజు 10 గ్రాముల పసిడి ధర రూ. 94 వేలకు పైగా నమోదు చేసి రికార్డ్ నెలకొల్పొంది. దేశీయంగా బంగారం ఈ ధరకు చేరుకోవడం ఇదే మొదటిసారి. 

New Update
Gold

Gold

పుత్తడి ధర భయపెడుతోంది. ఎప్పుడూ లేనంతగా ధర పెరిగి చుక్కలు చూపిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.94,150కి చేరింది. ఇదొక కొత్త రికార్డ్.  24 క్యారెట్ల పసిడి ధర రూ.92, 150 ఉన్నది ఇప్పుడు మరో రెండు వేలు పెరిగింది. బంగారానికి అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో దీని ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

బంగారం ఆల్ టైమ్ హిట్..

ఈ ఏడాది మొదలై ఇప్పటికి నాలుగు నెలలే గడిచింది. కానీ బంగారం ధర మాత్రం 18 శాతం పెరిగింది. జనవరి 1 న రూ. 79, 390 గా ఉన్న పుత్తడి ధర ఈరోజుకు దాదాపు రూ.15 వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్సు 3,149 డాలర్లకు చేరడంతో దేశీయంగా అదే స్థాయిలో పెరుగుతోంది.

తగ్గుముఖంలో వెండి..

ఇదే సమయంలో వెండి ధర మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. లాస్ట్ శుక్రవారం కిలో వెండి ఢిల్లీలో రూ.1,03,000 ఉండగా.. తాజాగా రూ.500 తగ్గి రూ.102,500కి చేరింది. ట్రంప్ టారీఫ్ లు రేపటి నుంచి అమలు అవుతున్నాయి. ఇది జరిగితే అన్ని దేశాలు అమెరికా బాటనే పడతాయి. అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారి తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి టైమ్ లో బంగారం వైపే పెట్టుబడులు పెట్టడం సురక్షితమని మదుపర్లు భావిస్తున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | gold-rates | all-time-record 

Also Read: PBK VS LSG: లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు