Dmart Shares: డీమార్ట్ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 9 శాతం షేర్లు క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయి. ఈ మేరకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి వెల్లడించిన ఫలితాల్లో ఇన్వెస్టర్లను మెప్పించడంలో డీమార్ట్ విఫలమయ్యాయి.
ఇది కూడా చదవండి: Sai Baba కి ప్రముఖుల నివాళులు.. కోదండరాం, అల్లం నారాయణ సహా..
దాదాపు రూ.27,900 కోట్లు పతనం..
సోమవారం ఉదయం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో (NSE) డీమార్ట్ షేర్లు 9.46 శాతం క్షీణించి రూ.4,139కు చేరుకున్నాయి. ఇక బీఎస్‌ఈలో (BSE) 9.37 శాతం క్షీణించి రూ.4,143.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో డీమార్ట్ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.27,900 కోట్లు పతనమవగా రూ.2.69 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం వరకు 8.30 శాతం నష్టంతో డీమార్ట్ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!
రూ.659.44 కోట్ల నికర లాభాలు..
ఇదిలా ఉంటే.. జులై-సెప్టెంబర్ ఆర్థిక సంవత్సరానికి డీమార్ట్ రూ.659.44 కోట్ల నికర లాభాలు పొందినట్లు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరగగా.. ఆదాయం 14.41 శాతం పెరిగి రూ.14,444.50 కోట్లుగా నమోదైంది. ఇక ఖర్చులు 14.94 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అయితే ఈ ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో బ్రోకరేజీ సంస్థలు డీమార్ట్ టార్గెట్ ధరలను తగ్గించాయి. దీని ఫలితంగా డీమార్ట్ షేర్లు పడిపోయాయి. సెన్సెక్స్ (Sensex) 608 పాయింట్ల లాభంతో 81,990 పాయింట్ల వద్ద, నిఫ్టీ (Nifty) 170 పాయింట్ల లాభంతో 25,134 పాయింట్ల వద్ద లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాల వేళ సూచీలు లాభాల్లో ముగిశాయి.డాలరుతో రూపాయి మారకం విలువ 84.06గా ఉంది.
ఇది కూాడా చదవండి: Telangana: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష