Muhurat Trading: నేడు మూరత్ ట్రేడింగ్.. స్టాక్స్ ఎప్పుడు కొనాలంటే?

స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించడం వల్ల లాభాలు వస్తాయని భారతీయుల నమ్మకం. 

New Update
Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్.. ఎందుకంటే.. 

సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. కానీ స్టాక్ మార్కెట్లకు మాత్రం కొత్త ఏడాది దీపావళి పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది దీపావళి నుంచి సంవత్ 2081 ప్రారంభం కానుంది. ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లు నేడు మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. ఈ రోజు సాయంత్రం గంట పాటు ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తాయి.

ఇది కూడా చూడండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే!

కేవలం గంట సమయం మాత్రమే..

సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ట్రేడింగ్ జరగనుంది. ఈ సమయంలో ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని భారతీయుల నమ్మకం. స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు ట్రేడింగ్ చేవస్తే వచ్చే దీపావళి పండుగ వరకు లాభాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలోనే మూరత్ ట్రేడింగ్‌లో పాల్గొంటారు.

ఇది కూడా చూడండి: సినిమాల లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఈ ట్రేడింగ్‌లో ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతున్న వారితో పాటు కొత్త పెట్టాలనుకునే వారికి చాలా ప్రత్యేకమైనది. తెలివిగా పెడితే దీర్ఘకాలం పాటు లాభాలు పొందవచ్చు. కంపెనీ షేర్లు అందుబాటు ధరలోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే లాబాలు పొందవచ్చు.

ఇది కూడా చూడండి: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే!

ఈ ట్రేడింగ్‌లో ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. స్టాక్స్‌లో కోల్ ఇండియా, భారతీ హెగ్జాకామ్, మాక్రో‌టెక్ డెవలపర్స్ నిపాన్ లైఫ్ ఇండియా అసెట్ మెనేజ్‌మెంట్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, ఛాలెట్ హోటల్స్, అరవింద్ ఫ్యాషన్స్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఎస్కార్ట్స్ కుబోటా వంటిలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయట.

ఇది కూడా చూడండి: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు