/rtv/media/media_files/2025/03/11/8CxZNKIkxqaZg6HBqnPd.jpg)
Demat Acoount Photograph: (Demat Acoount)
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పకుండా డీమాట్ అకౌంట్ ఉండాలి. అయితే ప్రతీ నెల ఈ డీమాట్ అకౌంట్లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంటే.. ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గాయి. గతేడాది డిసెంబర్‌లో 32.6 లక్షల డీమాట్ అకౌంట్లు తెరవగా, ఈ ఏడాది జనవరిలో 28.3 లక్షల అకౌంట్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి నెలకి వస్తే 22.6 లక్షలకు తగ్గింది. దీనికి ముఖ్య కారణం స్టాక్ మార్కెట్లు పడిపోవడంతో డీమాట్ అకౌంట్లు ఓపెన్ కావడం తగ్గిపోయాయని మార్కెట్ నిపుణలు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
New demat account openings at 21 month low.
— Jagadish Yasapuram. (@jaggu_100) March 10, 2025
Thanks to regulators. pic.twitter.com/rPLSuc0bXq
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
ఒకే పాన్ కార్డుపై వేర్వేరు..
ఎన్‌ఎస్‌డీఎల్, సీడీఎస్‌ఎల్ డేటా ప్రకారం గత నెలలో ఇండియాలో మొత్తం 19.40 కోట్ల డీమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అలాగే ఎన్‌ఎస్‌ఈ వద్ద రిజిస్టర్ చేసుకున్న యునిక్ ఇన్వెస్టర్లు (ఒక పాన్ కార్డుపై ఒక అకౌంట్) 11 కోట్ల మందికి పైగా ఉన్నారు. అయితే పాన్ కార్డుపై వేరు వేరు బ్రోకరేజ్ కంపెనీల దగ్గర డీమాట్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో షేర్లు అమ్మేయడంతో డీమాట్ అకౌంట్లు పడిపోతున్నాయి. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ వృద్ధి పూర్తిగా నెమ్మదించడం, కంపెనీల రిజల్ట్స్ సరిగ్గా మెప్పించకపోవడం, గ్లోబల్‌గా టారిఫ్ వార్ వంటి కారణాల వల్ల మార్కెట్ విలువ పతనం అవుతుంది. ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీ 4.5 శాతం పడిపోయాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 14 శాతం, చొప్పున పడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ అయితే 14 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో 17 శాతం పతనమయ్యాయి.