/rtv/media/media_files/cWoeqWocMewRQ4MrYxLC.jpg)
UPI Charges
ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా కూడా యూపీఐ చేస్తున్నారు. అయితే యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో లావాదేవీలు జరిపే యూజర్లపై వారిపై భారం పడనుంది. ఈ కార్డులను వినియోగించే వారిపై మర్చెంట్ ఛార్జీలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వార్షిక ఆదాయం రూ.40 లక్షలు ఉన్న వ్యాపారుల యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రానికి అధికారిక ప్రతిపాదన పంపగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
Is this news about UPI the reason for Paytm up 3% pic.twitter.com/GSAE7cIQOF
— Indian Retail Investing (@IndianInve10186) March 11, 2025
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
గతంలో బ్యాంకులకు కట్టేవారు..
ఇదిలా ఉండగా మూడేళ్ల కంటే ముందు వరకు యూపీఐ ఆధారిత చెల్లింపులకు వ్యాపారులు కొంత డబ్బులను బ్యాంకుకు కట్టేవారు. కొన్ని లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు రుసుము చెల్లించేవారు. ఇది కూడా కేవలం ఒక శాతం లోపు మాత్రమే ఉండేది. యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీలను 2022లో కేంద్రం తొలగించింది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఖర్చులు భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వస్తోంది.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!