Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలు ఈవీ రంగంలోకి ప్రవేశించడంతో, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు ఈ రంగంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి, అయితే దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీ ఏదో మీకు తెలుసా..? Also Read: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే! 2024 సెప్టెంబర్‌లో JSW MG మోటార్ ఇండియా పరిచయం చేసిన ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV), భారతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. వరుసగా మూడు నెలల పాటు, ఈ మోడల్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు(Electric Car)గా నిలిచింది. ఎంజీ విండ్సర్ ఈవీ(Electric Car) సేల్స్ వివరాలు అక్టోబర్ 2024లో 3,116 యూనిట్లు, నవంబర్‌లో 3,144 యూనిట్లు, డిసెంబర్‌లో 3,785 యూనిట్లు విక్రయించబడటంతో, మూడు నెలల కాలంలో మొత్తం 10,045 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ అద్భుత సేల్స్‌తో ఎంజీ విండ్సర్ EV, ఇండియాలో టాప్-సెల్లింగ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్‌గా నిలిచింది. Also Read: స్టుపిడ్ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్ ఎంజీ విండ్సర్ ప్రత్యేకతలు తక్కువ ధర, ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్ ఈ కారును వినియోగదారుల ప్రియంగా మార్చాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.50 లక్షల నుంచి రూ. 15.50 లక్షల వరకు ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 332 కిమీ ప్రయాణించే సామర్థ్యం (ARAI సర్టిఫికేషన్) కలిగిన ఈ వాహనం, వినియోగదారులకు చౌకైన బ్యాటరీ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. Battery-as-a-Service (BaaS) పథకం కింద, కస్టమర్లు కేవలం రూ. 9.99 లక్షలకు కారును కొనుగోలు చేసి, కిలోమీటరుకు రూ. 3.5 చొప్పున బ్యాటరీ రెంట్ చెల్లించవచ్చు. Also Read: Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ప్రత్యర్థులపై ఆధిపత్యం టాటా మోటార్స్, దేశంలో అతిపెద్ద ఈవీ తయారీదారుగా ఉన్నప్పటికీ, సంవత్సరానికి 100,000 ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. ఎంజీ విండ్సర్ EV మాత్రం తక్కువ బడ్జెట్, మెరుగైన మైలేజ్, వినూత్న పథకాలతో వినియోగదారుల మన్ననలు పొందింది. Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు