ఒక్కసారిగా కుదేలైన మార్కెట్..3.5 లక్షల కోట్ల నష్టం దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మొత్తానికి 3.5 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. By Manogna alamuru 30 Sep 2024 | నవీకరించబడింది పై 30 Sep 2024 17:26 IST in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Markets: ఏదో చేద్దాం అనుకుంటే...మరేదో అయింది అన్నట్టు అయింది ఈరోజు దేశీ మార్కెట్ల పరిస్థితి. వరుస లాభాలు వస్తున్నాయి కదా అని మదుపర్లు గరిష్టాల దగ్గర లాభాల స్వీకరణకు దిగారు. దాంతో పాటూ విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. దీంతో మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగి మొత్తం మార్కెట్ కుదేలయిపోవడానికి కారణం అయ్యాయి. దీంతో రజు ముగిసేసరికి సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 26 వేల మార్కును కోల్పోయి 25,800 స్థాయికి చేరింది. మదుపర్ల సంపద దాదాపు రూ.3.5 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.474.4 లక్షల కోట్లకు చేరింది. అసలు ఉదయం మొదలైన దగ్గర నుంచే సూచీలు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. క్రితం వారం ముగింపు 85,571.85దగ్గర ఉంటే ఈరోజు మొదలయ్యే టైముకి 85,208.76 దగ్గర మొదలయ్యాయి. తర్వాత కూడా రోజంతా ఇదే డౌన్ ట్రెండ్ కనిపించింది. ఇంట్రాడేలో 84,257.14 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరికి 1272.07 పాయింట్ల నష్టంతో 84,299.78 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 368 పాయింట్లు నష్టపోయి 25,810.85 వద్ద స్థిరపడింది. డాలర్ విలువ కూడా పడిపోయి..83.80కి చేరింది. సెన్సెక్స్ లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే లాభడ్డాయి. రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఈరోజు హవా అంతా చైనా వైపు నడిచింది. అక్కడ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పనుల వల్ల మదుపర్లు అటువైపు షేర్లు కొనడానికి మొగ్గు చూపించారు. దీంతో షాంఘై మార్కెట్లు రాణించాయి. మన మార్కెట్ పతనమైంది. ఇక దీంతో పాటూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. Also Read: ఎవరు ఉన్నా లేకపోయినా తగ్గేదేలే– హెజ్బుల్లా కొత్త ఛీఫ్ #stock-market #stock-market-news #stock-market-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి