Budget 2024: హోం లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..తగ్గనున్న ఈఎంఐ భారం..!!

సొంతిల్లు తీసుకోవాలని కలలు కనేవారికి ఈ బడ్జెట్ లో కేంద్రం శుభవార్త వినిపించనుందట. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

New Update
Budget 2024: హోం లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..తగ్గనున్న ఈఎంఐ భారం..!!

Budget 2024: ఈ ఏడాది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అందరిచూపు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీని ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024 (Budget 2024)పైనే ఉంది. భారీగా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే మరికొద్ది రోజుల్లోనే హోంలోన్(Home loan) తీసుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం మధ్యంతర బడ్జెట్(Interim budget) ను ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ మధ్యంత బడ్జెట్ లో హోంలోన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. హోంలోన్ తీసుకున్న వారికి...తీసుకోబోయే వారికి భారీ ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. హోంలోన్స్ తీసుకునే సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం తాయిలాలు కల్పించాలని హోం లోన్ అసలు, వడ్డీ పేమెంట్లపై పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని పలు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు కోరతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (credai) ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. ఈ సారి ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో హోంలోన్స్ పై ప్రోత్సహకాల ప్రతిపాదనలు అమలు చేయాలని కూడా కోరింది.

ఇది కూడా చదవండి: ఎయిరిండియా భద్రతా లోపం..రూ.1.10 కోట్ల జరిమానా విధించిన డిసీజీఏ..!!

అయితే ప్రస్తుతం హోం లోన్స్ చెల్లిస్తున్న అసలుకు సెక్షన్ 80సి పరిమితి ఒక లక్ష 50వేల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనిపై వడ్డీ సెక్షన్ 24బి ప్రకారం రూ. 2లక్షల వరకు మినహాయింపు లభిస్తోంది. అయితే వడ్డీపై పన్ను మినహయింపుల మొత్తాన్ని రూ. 5లక్షలు చేయాలంటూ క్రెడాయ్ కోరింది. దీని ద్వారా స్థిరాస్తి రంగం, జీడీపీ, ఉద్యోగాలు, మౌలిక వసతుల డెవలప్ మెంట్ కోసం ఎంతో తోడ్పడుతుందని దీనికి ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరింది. అయితే క్రెడాయ్ ప్రతిపాదనలపై ఈసారి బడ్జెట్ లో శుభవార్త వినిపిస్తోందని అర్దికనిపుణులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు