Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్‌ ప్రకటించిన బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో భారత్‌లో ఉన్న బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) హై అలర్ట్‌ను ప్రకటించింది. భారత్ - బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 4,096 కిలోమీటర్ల వరకు సరిహద్దు భద్రతా దళాలకు హై అలర్ట్‌ను జారీ చేసింది.

New Update
Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్‌ ప్రకటించిన బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో భారత్‌లో ఉన్న బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) హై అలర్ట్‌ను ప్రకటించింది. భారత్ - బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 4,096 కిలోమీటర్ల వరకు సరిహద్దు భద్రతా దళాలకు హై అలర్ట్‌ను జారీ చేసింది. బీఎస్‌ఎఫ్‌ డీజీ దల్జిత్‌ సింగ్‌ చౌదరి, ఇతర సీనియర్ అధికారులు.. భారత్-బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను సమీక్షించేందుకు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులను అక్కడి ప్రభుత్వం అణిచివేయడంతో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణలో 300 మంది చనిపోయారు. ప్రభుత్వం ఈ ఘటనలకు బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని షేక్‌ హసీనా సోమవారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ఆమె భారత్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: కోటి మంది బీహార్‌ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభిస్తారు: ప్రశాంత్ కిషోర్

ఈ ఘటన అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ దేశాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారని.. మధ్యంతర ప్రభుత్వం దేశాన్ని నడిపిస్తుందని తెలిపింది. దేశంలో మేము మళ్లీ శాంతిని పునరుద్దరిస్తామని.. ప్రజలు అల్లర్లను వెంటనే ఆపేయాలని కోరుతున్నామని పేర్కొంది. గత కొన్ని వారాలుగా జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి విచారణ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు దేశంలో ఎన్నిక కాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలని ప్రధానమంత్రి కొడుకు భద్రతా బలగాలను అభ్యర్థించారు. ఇప్పటికే వేలాదిమంది నిరసనాకారులు ప్రధాని నివాసంలో చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇదిలాఉండగా.. భారత్‌ కూడా ప్రస్తుతం ఎవరూ బంగ్లాదేశ్‌కు వెళ్లోద్దని దేశ ప్రజలకు ఆదేశాలు జారీచేసింది.

1971లో బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌తో పోరాడి స్వాతంత్య్రం సాధించుకుంది. దీంతో స్వాతంత్య పోరాట యోధులకు, వారి వారసులకు 30 శాతం రిజర్వేషన్‌ను కేటాయిస్తూ 1972లో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2018లో ఈ రిజర్వేషన్‌ను షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. కొంతమంది దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్వాతంత్ర్య పొరాట యోధుల వారసులకు మళ్లీ 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీర్పునిచ్చింది. దీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో.. చివరికి అత్యున్నత న్యాయస్థానం ఈ రిజర్వేషన్‌ను 5 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మరో 2 శాతం రిజర్వ్ చేసింది. మిగతా 93 శాతం మెరీట్‌ ఆధారంగా కోటాను కేటాయించింది. ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ హింసాత్మక ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్‌ మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి పారిపోయారు.

Also Read: మీలాగే దేశానికి సేవ చేస్తా.. ఆర్మీకి మూడో తరగతి బాలుడి లేఖ.. రాయన్ లేఖపై ఆర్మీ ఎమోషనల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు