Viral: మీలాగే దేశానికి సేవ చేస్తా.. ఆర్మీకి మూడో తరగతి బాలుడి లేఖ.. రాయన్ లేఖపై ఆర్మీ ఎమోషనల్..!

‘మై డియర్ ఆర్మీ.. వయనాడ్ వరదల్లో మీ పని తీరు అద్భుతం..పెద్దయ్యాక మీలాగే దేశానికి సేవ చేస్తా’ అంటూ కేరళ బుడ్డోడు ఆర్మీకి లేఖ రాశాడు. 'రాయన్.. నీ మాటలు మా గుండెను తాకాయి. నీ కోసం మేం ఎదురుచూస్తున్నాం’ అంటూ రాయన్‌కు ఆర్మీ లేఖ రాసింది. ఈ రెండు లేఖలు వైరల్ గా మారాయి.

New Update
Viral: మీలాగే దేశానికి సేవ చేస్తా.. ఆర్మీకి మూడో తరగతి బాలుడి లేఖ.. రాయన్ లేఖపై ఆర్మీ ఎమోషనల్..!

Also Read: నంద్యాలలో వైసీపీ నేత హత్యపై జగన్‌ సీరియస్‌.. పార్టీ నేతల్ని ఇలా చేయమని చెబుతూ..

ఈ క్రమంలోనే మూడో తరగతి చదువుతున్న కేరళ బుడ్డోడు రాయన్ ఆర్మీకి లేఖ రాశాడు. 'మై డియర్ ఆర్మీ.. వయనాడ్ వరదల్లో మీ పని తీరు అద్భుతం.. వయనాడ్ ప్రజల్ని వరదల్లో నుంచి మీరు ఎలా రక్షించారో నేను చూశాను. మీ ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని కాపాడారు. రాత్రంతా నిద్రాహారాలు మాని బిస్కెట్లతో కడుపు నింపుకుని మాకోసం మీరు బ్రిడ్జి కట్టారు. ఆ ఘటన నన్ను బాగా కదిలించింది. పెద్దయ్యాక నేను కూడా ఆర్మీలోకి వస్తా.. మీలాగే దేశానికి సేవ చేస్తా' అంటూ లేఖలో పేర్కొన్నాడు.


Also Read:  RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ!

రాయన్ లేఖపై ఆర్మీ స్పందించింది. 'రాయన్.. నీ మాటలు మా గుండెను తాకాయి. నీలాంటి హీరోలే మాకు ఇన్‌స్పిరేషన్. రాయన్.. నువ్వు త్వరగా పెద్దయి ఆర్మీలోకి వచ్చేసెయ్.. నువ్వు ఆర్మీ దుస్తుల్లో మాతోపాటు సేవ చేస్తే చూడాలని మాక్కూడా ఉంది. నీ రాక కోసం మేం ఎదురుచూస్తున్నాం. నీ ధైర్యానికి, నువ్వు మాకు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌కు థాంక్యూ సో మచ్‌ వారియర్‌' అంటూ రాయన్‌కు ఆర్మీ లేఖ రాసింది. ప్రస్తుతం ఈ రెండు లేఖలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతన్నారు. వయనాడ్‌ విలయంపై, ఆర్మీ పని తీరుపై చిన్న వయసులోనే ఆ బాలుడు ఆలోచించిన విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు