తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు గడ్డం ప్రసాద్ నామినేషన్ వేస్తారు. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. గడ్డం ప్రసాద్ ప్రసాద్ తన నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్ కానున్నారు. రేపు ఈయన అసెంబ్లీలో స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read: డ్రగ్స్ ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ కొత్త సీపీ శ్రీనివాస్ రెడ్డి