భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లందులో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ పడింది. అక్కడి మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతో పాటూ ముగ్గురు మునిసిపల్ కౌన్సిలర్లు ఇంకా పలువురు నాయకులు కూడా బీఆర్ఎస్ ను వీడారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం గోదావరి జలాలతో సస్య శ్యామలం చేయాలని అప్పుడు టీ.అర్.ఎస్ లో చేరాం. నాతో పాటు వేలాది మంది కూడా పార్టీలో చేరారు.జిల్లా లో పార్టీ అభివృద్ధికి పాటు పడ్డా. అయితే అహంకార చర్యల వల్ల పార్టీ పెద్దలే ఓడించాలని చూసారని విమర్శించారు తుమ్మల. చందాలు, దందాలు అవినీతి అరాచక పాలన తో బీ.అర్.ఎస్ పార్టీ నీ వదిలేసాం. తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రాహుల్ గాంధీ నాయకత్వం పై విశ్వాసం తో ఇప్పుడు కాంగ్రెస్ లో చేరామని స్పష్టం చేశారు.
Also Read:పొంగులేటి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..
ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా డీ.వీ అభివృద్ధి కి పాటుపడ్డారన్నారు తుమ్మల.నా కంటే ముందు ఇల్లందు గుండాల ఏంటో తుమ్మల వచ్చిన తరువాత ఇల్లందు గుండాల ఏంటో చరిత్రలో చూసారు. ఇల్లందు నియోజకవర్గం లో రహదారులు ఏర్పాటు తో విద్య వైద్యం ఏజెన్సీ వాసులకు దక్కాయి.నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మున్సిపల్ చైర్మన్ డీ వీ కి కాంగ్రెస్ లో భవిష్యత్ భాద్యత నాది అని హామీ ఇచ్చారు. ఇల్లందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కనకయ్య ను గెలిపించాలని తుమ్మల పిలుపునిచ్చారు.
Also Read:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగేవి అప్పుడేనా..
This browser does not support the video element.