MLC Kavitha: బీజేపీపై సెన్షేషనల్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.. బీజేపీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పైగా తెలంగాణ అభివృద్ధిని తమ అభివృద్ధిగా ప్రపంచ వేదికపై వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. By Shiva.K 28 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS MLC Kavitha Comments: బీజేపీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పైగా తెలంగాణ అభివృద్ధిని తమ అభివృద్ధిగా ప్రపంచ వేదికపై వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత.. అనేక అంశాలపై కీలక కామెంట్స్ చేశారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి.. బీజేపీ, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే తనకు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తనకు నోటీసులు జారీ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించాలని వారు భావిస్తున్నారు. ఆ కారణంతోనే.. దర్యాప్తు సంస్థలను తెలంగాణపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. తాను మాత్రమే కాదని, తమ పార్టీలో చాలా మంది లీడర్లను బీజేపీ టార్గెట్ చేసుకుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్‌గా దర్యాప్తు సంస్థను బీజేపీ ఉసిగోల్పుతుందన్నారు. అయితే, తనపై కేసు కాస్త హైలెట్ అయ్యిందన్నారు. ఈ దర్యాప్తు సంస్థలన్నీ స్వతంత్ర సంస్థ భావిస్తున్నాని అన్నారు. అయితే, రాజకీయ అంశాలు ఆ సంస్థలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆరోపించారు. కానీ, తనకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందన్నారు. తనపై కేసులపై న్యాయపరంగా పోరాడుతానని, బీజేపీకి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీకి రాజనీతి అనేదే లేదని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ, సీబీఐ, ఐటీ, ఈడీ వాలిపోతుంటాయని ఆరోపించారు. ఆ రాష్ట్రాల్లో బలమైన ప్రత్యర్థి నేతలే టార్గెట్‌గా దాడులు చేస్తారని ఆరోపించారు. ‘తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి. వారికి కాంగ్రెస్ నేతలెవరూ గుర్తుకు రారు. ఎందుకంటే.. కాంగ్రెస్ కాంపిటిషన్ ఇవ్వదని కాబట్టి. కానీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం వారికి గుర్తుకొస్తారు. పంజాబ్‌లో ఎన్నికలు ఉంటే అక్కడ రైడ్స్ నిర్వహిస్తారు. తమిళనాడులో ఎన్నికలు ఉంటే.. స్టాలిన్ ఇంట్లో రైడ్స్ చేస్తారు. నాపై మోపిన అభియోగంలో ఐటీ, ఈడీ, సీబీఐ, ఏమీ చేయలేకపోయాయి. ఫోన్లపై ఆరోపణలు చేస్తే.. ఆ ఫోన్లన్నింటినీ ప్రదర్శించాను. వారికి ఇచ్చాను. ఏం చెశారు? ఏం చెప్పలేకపోయారు. అయినా నేను తప్పు చేస్తే అరెస్ట్ చేసుకొండి. ఇదంతా బీజేపీ, మోదీ ఆపరేషన్. ఎక్కడ ఎన్నికలు ఉంటే.. అక్కడ కుట్రలు చేస్తారు. కానీ, ఇది కూడా ఒక విధంగా నాకు మంచిదే. మాకు ఒక గుడ్ సర్టిఫికెట్ లభించినట్లయితుంది. ప్రజల్లోకి వెళ్లి వివరించే అవకాశం ఉంటుంది. నా తప్పు లేదని వారికి వివరించే అవకాశం లభిస్తుంది. ప్రజలను నన్ను నమ్ముతారని విశ్వసిస్తున్నాను.‘ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అభివృద్ధిగా.. తెలంగాణ అభివృద్ధిని ప్రపంచ వేదికలపై వాడుకుంటున్నారని కేంద్రం ప్రభుత్వం తీరును ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కానీ, తెలంగాణకు మాత్రం నయా పైసా కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇవే కాదు.. ఏ పథకానికీ కేంద్రం డబ్బులు ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు లేదు.. ఒక ఐఐఎం లేదు.. ఒక ఐఐటీ లేదు.. ఎలాంటి స్పెషల్ గ్రాంట్స్ విడుదల చేయడం లేదు.. ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు.. ఏ విధంగా చూసినా తెలంగాణకు బీజేపీ ఆత్మబంధమే లేదు అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ.. సమయం సందర్భంతో పని లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కతున్నారని విమర్శించారు. ప్రతిసారి తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి బీజేపీకి తెలంగాణ ప్రజలు ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నించారు. ఓవైపు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్ముతూ.. మరోవైపు ఓట్లు ఎలా అడుగుతున్నారని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణపై మోదీ అందుకే విమర్శలు.. బీజేపీకి ఏనాడూ తెలంగాణ ప్రజలతో ఆత్మ సంబంధం లేదు. వారికి ఎంతసేపూ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్ తప్పితే.. తెలంగాణ అభివృద్ధితో వారికి అవసరం లేదు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని నినాదం ఇచ్చిన తరువాత తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఆనాడు నినాదం ఇచ్చిన తరువాత 3 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా తెలంగాణ ఏర్పాటు చేశారు. ఆ తరువాత తెలంగాణ ఏర్పాటు అంశంలో కూడా అనేకసార్లు రిక్వెస్ట్ చేస్తే తెలంగాణకు సపోర్ట్ చేయడానికి బీజేపీ అంగీకరించింది. అదే విధంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటి పార్లమెంట్ సెషన్‌లో తెలంగాణకు సంబంధించిన 9 మండలాలు లాక్కున్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా నిలబడి ప్రశ్నించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు సపోర్ట్ చేయలేదు. అన్యాయంగా 9 మండలాలు తీసుకుని ఆంధ్రాలో కలిపేశారు. పెద్ద ప్రాజెక్టును కూడా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేయడం జరిగింది. తెలంగాణపై ప్రధాని మోదీ మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్నారు. తల్లిని చంపారు.. బిడ్డను బ్రతికించారని అంటున్నారు. మోదీకి తెలంగాణపై ఎందుకు పగనో తెలియదు గానీ.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా తెలంగాణకు ఇవ్వలేదు. కనీసం ఏపని చేపట్టినా మద్ధతు ఇవ్వరు. రాష్ట్రానికి రావాల్సిన రాయితీలను ఇవ్వరు. బకాయిలు ఇవ్వరు. పైగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, మత ఘర్షణలు రేపు కామెంట్స్ చేస్తుంటారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేయడం, తెలంగాణ అభివృద్ధిని తమ అభివృద్ధిగా ప్రపంచ దేశాల్లో చాటి చెప్పుకోవడం చేస్తుంటారు అంటూ విమర్శలు గుప్పించారు కవిత. ఈసారి కూడా బీఆర్ఎస్‌దే గెలుపు.. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నాని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ ఎంతో వర్క్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అందుతుందన్నారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని, ఐటీ రంగాన్ని ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇక హైదరాబాద్ నగరం అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుందన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికలకు టఫ్ కావొచ్చేమో గానీ.. తమకు కాదన్నారు ఎమ్మెల్సీ కవిత. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందన.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అరెస్ట్ వేరే రాష్ట్రంలో జరిగిన అంశం అని, దాంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. రెండు వేరు వేరు రాజకీయ పార్టీల మధ్య జరిగిన అంశం కాబట్టి దానిని తాము పట్టించుకోబోమన్నారు. అరెస్ట్‌పై తాము చేసేది కూడా ఏమీ లేదన్నారు. వాళ్ల రాజకీయాలు, వాళ్ల కేసులు.. వారికే తెలుసునని అన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. డీలిమిటేషన్ పై స్పందన.. భారతదేశ వ్యాప్తంగా జనాభా అసమానంగా పెరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరిగిందని.. మరికొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిందన్నారు. ప్రధానంగా సౌత్‌లో జనాభా తగ్గి.. నార్త్‌లో పెరిగిందన్నారు. దక్షిణా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను బాగా పాటించారు కాబట్టే జనాభా కంట్రోల్ అయిందన్నారు. కానీ, నార్త్‌లో మాత్రం పెద్ద ఎత్తున జనాభా పెరిగిందన్నారు. 1971లో 50 ఏళ్ల పాటు డీలిమిటేషన్ చెయ్యమని నాటి ప్రభుత్వం చెప్పగా.. 2021లో ఈ డీలిమినేషన్ అంశంపై చర్చించారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే, జనాభా అసమానంగా ఉన్నందున.. డీలిమిటేషన్ చేయబోమని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశఆరు. ఇప్పుడు మళ్లీ 2026లో ఆ డిస్కర్షన్ వస్తే.. బీఆర్ఎస్ తరుఫున తమ వాయిస్‌ను బలంగా వినిపిస్తామని చెప్పారు. తెలంగాణ మాత్రమే కాదని, దక్షిణాది రాష్ట్రాన్ని కూడా వాయిస్ వినిపిస్తాయన్నారు. అసమాన సీట్స్ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ఇబ్బంది జరుగుతుందన్నారు. దీనిపై ఖచ్చితంగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. గవర్నర్ నిర్ణయంపై అసహనం.. ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఒక బీసీ, ఒక ఎస్టీ సమాజిక వర్గాలకు చెందని వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే.. తిరస్కరించడం సరికాదన్నారు. ఈ రెండు వర్గాలకు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి అంశాలను రాజకీయ వేదికల్లో చర్చించేందుకు అవకాశం లబిస్తుందని సదుద్దేశంతో కేసీఆర్ ఈ ఇద్దరినీ నామినేట్ చేశారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. బలహీన వర్గాలు సపోర్ట్ చేస్తున్న సందర్భంలో వారిని అడ్డుకోవడం అనేది తగిన చర్య కాదన్నారు. గవర్నర్ ఇప్పుడు రిజెక్ట్ చేసినా.. మళ్లీ వారి పేర్లనే పంపిస్తామని, అప్పుడు తప్పక అంగీకరించాల్సి వస్తుందన్నారు. పొలిటికల్ ఇష్యూ క్రియేట్ చేయడం కోసమే గవర్నర్ ఇలా చేశారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అసలు దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. Also Read: RTV Bramhanandam Interview: రంగమార్తాండ కోసం మూడు రోజులు ఉపవాసం.. హాస్యబ్రహ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ లైవ్ Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే.. #telangana-politics #telangana-news #brs-party #brs-mlc-kavitha #brs-mlc-kavitha-slams-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి